NTV Telugu Site icon

Viral News: సీసాలో బయట పడ్డ 135ఏళ్ల నాటి లేఖ .. అందులో ఉన్నది చదవగానే..

Letter

Letter

Viral News: స్కాట్లాండ్‌లోని ఓ ఇంట్లో మరమ్మతుల కోసం తవ్వకాలు జరుపుతుండగా 140ఏళ్ల కిందటి లేఖ బయటపడింది. మందు బాటిల్లో భద్రపరిచిన ఈ లేఖ విక్టోరియన్ కాలం నాటిదని పలువురు భావిస్తున్నారు. సీసాలోని లేఖను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాకపోవటంతో ఇంటి యాజమానులు దానిని పగలగొట్టారు. అనంతరం అందులోని లేఖను తీసి చదివే ప్రయత్నం చేశారు. ఆ లేఖపై 1887 సంవత్సరం తేదీ వేసి ఉంది. కాగా అందులో ఇద్దరు వ్యక్తుల సంతకాలు చేసి ఉన్నాయి. పీటర్ అలన్ అనే 50ఏళ్ల వృద్ధుడు ఎడిన్‌బర్గ్‌ ప్రాంతంలోని ఓ ఇంటిలో ప్లంబర్ పనిచేస్తున్నాడు. పైపులైన్ గుర్తించేందుకు తవ్వకాలు నిర్వహించాడు. ఈ క్రమంలో తొవ్వుతుండగా .. విస్కీ బాటిల్ కనిపించింది. దానిలో విక్టోరియన్ కాలంనాటి లేఖ ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని వెంటనే ఇంటి యాజమానికి సమాచారం అందించారు.

Read Also: Donald Trump : ‘ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్’.. ట్విటర్ పై ట్రంప్ అసహనం

ఆ ఇంటి యాజమాని ఎలిద్ స్టింప్సన్. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె ఆ బాటిల్ ను తెరిచేందుకు ప్రయత్నించింది. కానీ పది, ఎనిమిదేళ్ల వయస్సు కలిగిన పిల్లలు వచ్చేవరకు ఆగి ఆ తరువాత ఆ సీసాను పగులగొట్టింది. అనంతరం ఆ లేఖను సీసా నుంచి బయటకు తీసి చదివింది.1887 అక్టోబర్ 6 కాలంనాటి ఉత్తరంగా గుర్తించారు. అందులో ఇద్దరు మగ వ్యక్తులు జేమ్స్ రిట్చీ, జాన్ గ్రీన్‌ అనే వ్యక్తులు ఈ లెటర్ పై సంతకం చేసినట్లు ఉంది. నోట్‌ను చదవగా ఇలా వ్రాసి ఉంది.. “జేమ్స్ రిట్చీ అండ్ జాన్ గ్రీవ్ ఈ అంతస్తును వేశారు, కానీ వారు విస్కీని తాగలేదు. “ఎవరైనా ఈ బాటిల్‌ను కనుగొంటే మన దుమ్ము రోడ్డుపై ఎగిరిపోతోందని అనుకోవచ్చు.” అని ఉంది. ఆ తరువాత ఎలిద్ బాటిల్, నోట్ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో 135సంవత్సరాల నాటి లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.