NTV Telugu Site icon

Burning alive: బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పు పెట్టి సజీవ దహనం..

Burning

Burning

మల విసర్జనకు వెళ్లిన దళిత బాలికపై నిప్పు పెట్టారు గుర్తుతెలియని దుండగులు. దీంతో బాలిక సజీవ దహనమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని బలరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. హరాయ పోలీస్ స్టేషన్ సమీపంలోని గ్రామానికి చెందిన 13 ఏళ్ల దళిత బాలిక శుక్రవారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం సమీపంలోని పొలాల్లోకి వెళ్లింది. అయితే గంట తర్వాత కూడా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బాలిక కోసం వెతుకుతుండగా పొలంలో నిప్పంటించిన బాలిక సజీవ దహనమై కనిపించిందని గ్రామస్తులు తెలిపారు.

Also Read: Monditoka Jaganmohan Rao: ప్రచారంలో దూసుకుపోతున్న మొండితోక జగన్మోహన్‌ రావు

ఇంతలో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనలో కాలిన బాలిక మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీస్ అధికారులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.