బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. SBI మొత్తం 996 పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిసెంబర్ 2న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా, వారికి సంబంధిత రంగంలో పని అనుభవం, నైపుణ్యాలు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి పోస్టును బట్టి నిర్ణయించారు. అభ్యర్థుల వయస్సు మే 1, 2025 నాటికి లెక్కిస్తారు.
Also Read:Perni Nani : తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట
అభ్యర్థుల కనీస వయస్సు 20, 23, 26 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 35, 42 సంవత్సరాలు. కొన్ని వర్గాల అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది. జనరల్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 750. ఇంకా, SC/ST, వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఉంది. SBI SO పోస్టులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు డిసెంబర్ 23, 2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
