NTV Telugu Site icon

Psycho woman : షాకింగ్.. 11వేల మందిని చంపిన 97ఏళ్ల వృద్ధురాలు

Nazi War Crimes

Nazi War Crimes

Psycho woman : రెండో వరల్డ్ వార్ టైంలో ఏకంగా వేల మందిని చంపిన కేసులో 97ఏళ్ల వృద్ధురాలికి కోర్టు శిక్షవిధించింది. నాజీ నిర్బంధ శిబిరం కార్యదర్శిగా పనిచేసిన మహిళ వేల మందిని హత్య చేయడంలో ఆమె పాత్ర ఉందని భావించిన కోర్టు మంగళవారం దోషిగా నిర్ధారించింది. ఆ సమయంలో ఆమె అక్కడ నిర్బంధంలో ఉన్న యుద్ధ ఖైదీలు సుమారు 10,500 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఐతే ఆ హత్యల్లో ఈ వృద్ధురాలు ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిందితులకు సహకరించినట్లు జర్మనీలో ఇట్జెహులో జిల్లా కోర్డు మంగళవారం పేర్కోంది. ఇంతమంది మరణానికి సహకరించినందుకుగానూ ఇట్జెహోలోని జిల్లా కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించింది. ఆ కేసులో ఆమెకు రెండేళ్ల బహిష్కరణ శిక్ష తోపాటు ఆమె ఈ హత్యలు చేసినప్పుడూ వయసు 18 నుంచి 19ఏళ్ల వయసు ఉండడంతో అప్పటి బాల నేరస్తుల చట్టం ప్రకారం విధించే శిక్షలను కూడా విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

Read Also: 2000Year Old Clay Candle : రెండు వేల ఏళ్ల కిందటి కొవ్వొత్తి లభ్యం

వాస్తవానికి ఆమెపై దాదాపు 11,412 మంది హత్యలకు సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఐతే 2021 నుంచి కోర్టులో ట్రయల్స్‌ ప్రారంభం కావడం ఆలస్యమైంది. అదీగాక ఆమె కూడా అనారోగ్యం బారిన పడడంతో కోర్టుకు అందుబాటులో లేకుండా పోయింది. ఆ వృద్ధురాలు 1943 నుంచి 1945 కాలంలో స్టట్‌థాప్‌ నాజీ నిర్బంధ శిబిరంలో పనిచేసింది. అక్కడ నిర్బంధంలో ఉన్న దాదాపు 65 వేల మంది ఆకలితో లేదా వ్యాధులతో మరణించారు. మరికొంతమంది స్టట్‌థాప్‌లోని గ్యాస్‌ చాంబర్‌లో మరణించారు. వారంతా నాజీల నిర్మూలన ప్రచారంలో పాల్గొన్న యుద్ధ ఖైదీలు, వారిలో కొందరూ యూదులు కూడా ఉన్నట్లు సమాచారం. ఐతే ఇది రెండో ప్రపంచ యుద్ధ నేరాలకు సంబంధించిన చివరి కేసు విచారణ అని జర్మనీ స్థానిక మీడియా పేర్కొంది.