ఇండియాకు చెందిన భగవానీ దేవి డాగర్ 95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్ లో అద్బుతాలు చేస్తోంది. వయసు పెరుగుతుననా.. మెడల్స్ కొట్టాలన్న ఆమె ఆకాంక్ష మరింత ఎక్కువగా పెరిగింది. పోలాండ్ లోని టొరున్ లో జరిగిన తొమ్మిదో వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటింది. 60 మీటర్ల రన్నింగ్, షాట్ పుట్, డిస్క్ త్రో ఈవెంట్స్ లో భగవానీ డాగర్ స్వర్ణ పతకాలు సాధించింది. ఈ బామ్మ గతేడాది కూడా వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియర్ షిప్ అవార్డ్ సాధించింది. 2022లో ఒక గోల్డ్, రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది.
Also Read : Philippine: ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 31 మంది దుర్మరణం
హర్యానాలోని ఖేడ్ కా గ్రామానికి చెందిన భగవానీ దేవి డాగర్ కు 12ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. 30 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయింది. ఆ తర్వాత రెండో వివాహం చేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు.. అప్పటికే తన నాలుగేళ్ల కూతురు, కడుపులో పెరుగుతున్న మరో బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నాలుగేళ్ల తర్వాత అనారోగ్యం తన ఎనిమిదేళ్ల కూతురిని బలి తీసుకుంది.
Also Read : Hanuman: మీ క్రియేటివిటీకి దండం సామీ.. ప్రభాస్ అంటే మరీ ఇంత పిచ్చా..?
అయితే తాను ధైర్యం కోల్పోకుండా కూలీ, వ్యవసాయం పనులు చేసి కొడుకును పెంచి పెద్ద చేసింది. ఆమె కొడుకు ఢిల్లీ మున్సిపాల్ కార్పోరేషన్ లో క్లర్క్ గా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగైంది. కొడుక్కి పెళ్లి చేసిన అనంతరం అథ్లెటిక్స్ పై దృష్టి సారించింది. అక్కడి నుంచి తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ వచ్చిన ఆమె 80 ఏళ్ల వయసులో తొలిసారి 100 మీటర్ల రన్నింగ్ లో పాల్గొంది. అక్కడ నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. తాజాగా 95 ఏళ్ల వయసులో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇక భగవానీ దేవీ పెద్ద మనువడు వికాస్ డాగర్ పారా అథ్లెట్ గా రాణిస్తున్నడు. ఇప్పటికే అథ్లెటిక్స్ లో ఎన్నో పథకాలు సాధించిన వికాస్ డాగర్ ఖేల్ రత్న తో పాటు పలు అవార్డులను అందుకున్నాడు.