ఇండియాకు చెందిన భగవానీ దేవి డాగర్ 95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్ లో అద్బుతాలు చేస్తోంది. 60 మీటర్ల రన్నింగ్, షాట్ పుట్, డిస్క్ త్రో ఈవెంట్స్ లో భగవానీ డాగర్ స్వర్ణ పతకాలు సాధించింది. ఈ బామ్మ గతేడాది కూడా వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియర్ షిప్ అవార్డ్ సాధించింది.