Site icon NTV Telugu

Old Man Molests Minor: తొమ్మిదేళ్ల బాలికను వేధించిన 92 ఏళ్ల వృద్ధుడు.. మూడేళ్లు జైలు శిక్ష

Old Man Molests Minor

Old Man Molests Minor

Old Man Molests Minor: ఎన్ని చట్టాలొచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. పండు ముసలి నుంచి చిన్నారుల వరకు ఎవరిని వదలడం లేదు కొందరు దుర్మార్గులు. రేపో మాపో కాటికి పోయే ముసలివాళ్లు కూడా చిన్నారులపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం తొమ్మిదేళ్ల బాలికను వేధించిన కేసులో 92 ఏళ్ల వృద్ధుడికి ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో కేంద్రపారా జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి త్రిదిక్రమ్ కేశరి చిన్హార మంగళవారం తీర్పును ప్రకటించారు.కోర్టు దోషికి రూ 3,000 జరిమానా విధించింది. అతను ఆ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది.

88th marriage: 14 ఏళ్లకే మొదలుపెట్టేశాడట.. 61వ ఏట 88వ పెళ్లి..!

2019 జనవరి 26న మార్షఘై ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై దోషి వేధింపులకు పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. అయితే బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఆమె తల్లి ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనోజ్ కుమార్ సాహూ తెలిపారు.

Exit mobile version