Site icon NTV Telugu

Indian Air Force: భారత వైమానిక దళం ధైర్యానికి ప్రధాని మోడీ సెల్యూట్..

Modi

Modi

Indian Air Force: భారత వైమానిక దళం 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు (ఆదివారం) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వైమానిక దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. వారి గొప్ప సేవ, త్యాగం మన గగనతల భద్రతకు భరోసానిస్తుందని అన్నారు. భారత వైమానిక దళం యొక్క ధైర్యసాహసాలు, నిబద్ధత, అంకితభావానికి భారతదేశం గర్విస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత వైమానిక దళం ధైర్యానికి సెల్యూట్ చేస్తూ ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు.

Read Also: Janareddy: వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంట్ బరిలో ఉంటా

భారత వైమానిక దళ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 న జరుపుకుంటుంది. అయితే ఈసారి జరుపుకునే వేడుకల్లో ఒక ప్రత్యేకత ఉంది. భారత వైమానిక దళం యొక్క 91వ వార్షికోత్సవం సంగం నగరంలో మొదటిసారిగా జరుపుకుంటున్నారు. అందుకోసం ఆదివారం ఉదయం 7.40 గంటలకు బమ్రౌలీలో వైమానిక యోధుల కవాతు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైమానిక దళం నూతన జెండాను కూడా ఆవిష్కరించారు. దానిని అత్యంత వైభవంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిపేందుకు ప్రయాగ్‌రాజ్‌లో చాలా కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అన్ని యుద్ధ విమానాలు దీని కోసం సాధన చేస్తున్నాయి.

Read Also: Air India: అక్టోబర్ 14 వరకు ఇజ్రాయెల్‌కు విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా

Exit mobile version