NTV Telugu Site icon

Lord Hanuman: టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం.. స్థాపించింది ఆ స్వామీజీనే

America

America

దేవుడిపై భక్తి దేశాలు దాటి వెళ్లింది. భారత్లో దైవాన్ని కొలిచే వారు ఎక్కువే.. కానీ ఇప్పుడు ఆ భక్తి విదేశాలకు కూడా పాకింది. మనం మన దేశంలో ఎంతో ఎత్తైన దేవుడి విగ్రహాలను చూశాం. ఇప్పుడు అలాంటి భారీ విగ్రహాన్ని అమెరికాలోని టెక్సాస్‌లో ఏర్పాటు చేశారు. హ్యూస్టన్ సమీపంలో 90 అడుగుల ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే.. అమెరికాలోని న్యూయార్క్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (151 అడుగులు), ఫ్లోరిడాలోని హాలండేల్ బీచ్‌లోని పెగాసస్ మరియు డ్రాగన్ (110 అడుగులు), తాజాగా.. హనుమంతుడి మూడవ ఎత్తైన విగ్రహం ఉంది. కాగా.. దీనికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టినట్లు విగ్రహావిష్కరణ నిర్వాహకులు తెలిపారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాలలో ఒకటన్నారు.

Ministry of Health: 156 మందులను నిషేధించిన ప్రభుత్వం.. లిస్ట్ ఇదే.. చెక్ చేసుకోండి?

శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 18 వరకు జరిగిన మహాప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహం నిస్వార్థానికి, భక్తికి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. రాముడు, సీతను ఏకం చేయడంలో హనుమంతుడి పాత్రను దృష్టిలో ఉంచుకుని దీనికి స్టాట్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టినట్లు నిర్వహకులు తెలిపారు.

విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు..?
“పద్మభూషణ్ విజేత, ప్రముఖ వేద పండితుడు శ్రీ చిన్న జీయర్ స్వామీజీ యొక్క దూరదృష్టితో ఈ విగ్రహం సాధ్యపడింది. ఆగస్టు 15న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18న మహా సంప్రోక్షణ వేడుకలు ప్రారంభమయ్యాయి” అని నిర్వహకుల్లో ఒకరు చెప్పారు. “శ్రీ చిన్న జీయర్ స్వామీజీ మరియు వేద అర్చకులు, పండితుల నాయకత్వం కారణంగా ఈ పండుగ ఆధ్యాత్మికతకు అద్భుతమైన ప్రదర్శనగా మారింది.” అని పేర్కొన్నారు.

Mamata Banerjee: దేశంలో అత్యాచార ఘటనలపై ప్రధానికి దీదీ లేఖ..

అంగరంగ వైభవంగా శంకుస్థాపన జరిగింది.
ఈ విగ్రహం ప్రారంభోత్సవ వేడుకలో హెలికాప్టర్ ద్వారా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. అలాగే.. గంగాజలం చల్లారు. వేలాది మంది భక్తులు శ్రీ రామ్, జై హనుమాన్ నామస్మరణల మధ్య హనుమంతుడి మెడలో 72 అడుగుల పొడవైన దండను వేశారు. ఈ విగ్రహం హనుమంతుని అచంచలమైన స్ఫూర్తికి ప్రతీకగా ఉండటమే కాకుండా.. అమెరికా సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో కొత్త మైలురాయిని కూడా సూచిస్తుందని నిర్వాహకులు తెలిపారు.