Site icon NTV Telugu

Terrorist Incidents: రెండు నెలల్లో 9 ఉగ్రవాద ఘటనలు.. ఈ ఏడాది 22 మంది మృతి

Terrorist

Terrorist

ఈ ఏడాది జమ్మూ డివిజన్‌లో ఉగ్రవాద కేసులు పెరిగాయి. అయితే.. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మూడంచెల భద్రతా గ్రిడ్‌ను రూపొందిస్తామని అధికారులు చెప్పారు. జూన్-జూలై నెలల్లోనే ఎనిమిది ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజున మొదలైన ఉగ్రదాడుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భద్రతకు సంబంధించి ఎన్నో అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగినా.. కొందరు ఉగ్రవాదులు మాత్రం దాడులు ఆపడం లేదు. జమ్మూ డివిజన్లో జరిగిన దాడుల గురించి మాట్లాడుతూ.. జనవరి 1 నుండి ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడుల్లో ఆర్మీ కెప్టెన్‌తో సహా 12 మంది భద్రతా సిబ్బంది బలి అయ్యారు. ఈ దాడుల్లో 10 మంది పౌరులు మరణించగా, 55 మంది గాయపడ్డారు. ఈ సమయంలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Read Also: Justice Narasimha Reddy: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కమిషన్ ఛైర్మన్‌గా వైదొలిగా..

ఈ ఏడాది జరిగిన తీవ్రవాద ఘటనలు:
జూలై 15: దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక అధికారి సహా నలుగురు ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందారు.
జూలై 8: కతువా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొంది, చాలా మంది గాయపడ్డారు.
జులై 7: రాజౌరీ జిల్లాలో భద్రతా స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో సైనిక సిబ్బందికి గాయాలు అయ్యాయి.
జూన్ 26: దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు.
జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీసు గాయపడ్డాడు.
జూన్ 11/12: కథువా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడ ఓ సీఆర్పీఎఫ్ జవాను బలి అయ్యాడు. అదే రోజు దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి గాయపడ్డారు.
జూన్ 9: రియాసి జిల్లాలో బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది యాత్రికులు మరణించారు మరియు 42 మంది గాయపడ్డారు.
4 మే 2024: పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో భారత వైమానిక దళానికి చెందిన ఒక సైనికుడు వీరమరణం పొందాడు మరియు ఐదుగురు గాయపడ్డారు.
ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్రామ రక్షణ గార్డు వీరమరణం పొందాడు.
ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చిచంపారు.

Exit mobile version