NTV Telugu Site icon

Biryani: రైలులో బిర్యానీ తిని ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Biryani

Biryani

Biryani: రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు.. రకరకాల ఫుడ్‌ ఐటమ్స్‌ విక్రయిస్తుంటారు.. టీ, కాఫీ, బిస్కెట్లు, టిఫిన్లు, బిర్యానీ.. ఇలా ఒకరి తర్వాత ఒకరు రైళ్లలో ప్రయాణికులను ఉక్కొరిబిక్కిరి చేస్తుంటారు.. అలా పదే పదే వాళ్లు వస్తుండే సరికి.. కొందరు పిల్లల ఒత్తిడితో.. మరికొందరు ఆకలితో ఫుడ్‌ ఐటమ్స్‌ తీసుకుంటారు.. మరికొందరు.. ఏదైనా స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు.. అక్కడ దొరికే వాటిని కొనేస్తుటారు.. అయితే, అది అంత మంచిది కాదని మరో రెండు ఘటనలు రుజువు చేశాయి. అయితే, విశాఖ రైల్వేస్టేషన్‌ తో పాటు రైళ్లలో కొనుగోలు చేసిన బిర్యానీ తిని దాదాపు 10 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.

Read Also: Pallavi Prasanth : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఏం ఇప్పుడు చేస్తున్నాడో తెలుసా?

రైళ్లలో అస్వస్థతకు గురైన ప్రయాణికులకును హుటాహుటిన రాజమహేంద్రవరంలోని జీజీహెచ్‌కు తరలించారు.. ఎవరికీ ప్రాణాపాయంలేకపోయినప్పటికీ.. తీవ్ర అస్వస్థత ఇబ్బంది పడుతున్నారు. ఇక, పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో సేలంకు వెళ్తున్న 15 మంది కార్మికులు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో బిర్యానీలు కొనుగులు చేశారట.. అయితే, ఆ బిర్యానీ తిన్న అరగంట తర్వాత వారిలో ఐదుగురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారని.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారడంతో రైలు మదద్‌ యాప్‌లో ఫిర్యాదు చేయడం.. సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో రైల్వే సిబ్బంది, పోలీసులు సిద్ధంగా ఉండి.. వారిని రాజమండ్రి జీజీహెచ్‌కి తరలించారు. మరోవైపు, దిబ్రూగఢ్‌-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో కేరళలోని పాలక్కడ్‌కు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులు విశాఖ రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత రైలులో ఎగ్‌ బిర్యానీలు కొనుగోలు చేసి ఆరగించారు.. వారికి కూడా అదే పరిస్థితి ఎదురైంది.. వారిలో నలుగురిని రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో దించి ఆస్పత్రికి తరలించారు.. ఇలా మొత్తంగా రైళ్లలో బిర్యానీ తిని ఒకే రోజు 9 మంది ఆస్పత్రిలో చేరారు. ప్రయాణాల్లో ఎక్కడపడితే అక్కడ ఆహారాన్ని కొనుగోలు చేసి.. లేని జబ్బులు తెచ్చుకోవద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Show comments