మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 9 మంది ఎంపీలు ఉన్నారు. వారితో పాటు ఎస్ జైశంకర్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని రాజ్యసభ ఛాంబర్‌లో చైర్మన్ జగదీప్ ధన్‌కర్ వారిచేత ప్రమాణం చేయించారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికవడం జైశంకర్ కు ఇది రెండోసారి. 2019లో తొలిసారిగా ఎన్నికయ్యారు. అతను ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. మరోవైపు జైశంకర్‌తో పాటు ఇతర బీజేపీ సభ్యులు బాబూభాయ్ జెసంగ్‌భాయ్ దేశాయ్ (గుజరాత్), కేస్రీదేవ్‌సింగ్ దిగ్విజయ్‌సింగ్ ఝాలా (గుజరాత్), నాగేంద్ర రే (పశ్చిమ బెంగాల్) ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also: Akira Nandan: బ్రేకింగ్.. ఫిల్మ్ స్కూల్ లో చేరిన పవన్ వారసుడు.. టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం
అంతేకాకుండా మరో ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. అందులో డెరెక్ ఓబ్రియన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, ప్రకాష్ చిక్ బరైక్ మరియు సమీరుల్ ఇస్లాం ఉన్నారు. ఓ’బ్రియన్, సేన్, ఇస్లాం, సుఖేందు శేఖర్ రే బెంగాలీలో ప్రమాణం చేశారు.
Read Also: Viral Video: అర్ధరాత్రి బైకుపై రెచ్చిపోయిన లవర్స్.. తుఫాకీలతో రచ్చ..
సోమవారం ప్రమాణం చేసిన తొమ్మిది మంది సభ్యులలో ఐదుగురు కొత్తగా ఎన్నికయ్యారు. వారిలో నాగేంద్ర రే, ప్రకాష్ చిక్ బరాక్, సమీరుల్ ఇస్లాం, కేస్రీదేవ్‌సింగ్ దిగ్విజయ్‌సింగ్ ఝాలా మరియు బాబూభాయ్ జెసంగ్‌భాయ్ దేశాయ్ ఉన్నారు. నలుగురు సభ్యులు బెంగాలీలో, ముగ్గురు హిందీలో, ఇద్దరు ఇంగ్లీషులో ప్రమాణం చేశారని రాజ్యసభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ, సచివాలయంలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.