NTV Telugu Site icon

Explosion: బాణాసంచా గోదాంలో పేలుడు.. 9 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు

Thailand

Thailand

Blast At Fireworks Warehouse In Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం థాయ్‌లాండ్‌లోని బాణసంచా గోదాములో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. దక్షిణ ప్రావిన్స్ నరాతీవాట్‌లోని సుంగై కొలోక్ పట్టణంలో జరిగిన పేలుడు భవనం నిర్మాణ పనుల సమయంలో వెల్డింగ్ చేయడం వల్ల సంభవించినట్లు భావిస్తున్నారు. సుంగై కోలోక్‌లో బాణసంచా నిల్వచేసే గోదాం ఈ మధ్యాహ్నం పేలిందని, ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. 115 మంది గాయపడ్డారని నరాతీవాట్ గవర్నర్ సనన్ పొంగక్సోర్న్ చెప్పారు.

Also Read: Pakistan: పాక్ యువకుడిని పెళ్లాడిన అంజుకి ఖరీదైన బహుమతులు.. ఏం ఇచ్చారంటే..!

ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయని.. భవనం నిర్మాణంలో ఉన్నందున, స్టీల్ వెల్డింగ్ ప్రక్రియలో సాంకేతిక లోపం ఏర్పడిందని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అనేక దుకాణాలు, ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తులు పొగలు వ్యాపించాయి. మలేషియా సరిహద్దులో ఉన్న పట్టణంలో పేలుడు కారణంగా 500 ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుడు వల్ల 100 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లు కూడా కంపించాయని స్థానికులు తెలిపారు. నిర్మాణ రంగంలో థాయ్‌లాండ్‌లో భద్రత తక్కువగా ఉంది. ఘోరమైన ప్రమాదాలు సర్వసాధారణం. గత నెలలో బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న రోడ్డు వంతెన ట్రాఫిక్‌లో కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.