Bharat Jodo Yatra: తెలంగాణలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. రాత్రి బోయిన్ పల్లిలో బసచేసిన రాహుల్ గాంధీ పాదయాత్రను హుషారుగా ప్రారంభించారు. ఉదయం 6 గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీయాన్ ఐడియాలజీ సెంటర్ నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమైంది. నేడు రాహుల్ బాలానగర్, హబీబ్ నగర్, మూసాపేట, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, హఫీజ్ పేటమీదుగా సాగుతారు. ఉదయం పది గంటలకు హోటల్ కిన్నెర గ్రాండ్ వద్ద అల్పాహారం తీసుకుని మియాపూర్, రామచంద్రాపురం, పఠాన్ చెరువు మీదుగా సాగుతారు. పఠాన్ చెరువు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత ముత్తంగి పరిసరాల్లో సభ నిర్వహిస్తారు.
Read Also: Kamal Movie Crazy Update: క్రేజీ అప్డేట్.. భారతీయుడు-2లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి
న్యూబోయిన్ పల్లి, బాలానగర్ మెయిన్ రోడ్డు, ఫిరోజ్ గూడ, జింకలవాడ, ముంబై హైవే, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా మదీనగూడ వరకు యాత్ర ఉంటుంది. రుద్రారం వినాయక ఆలయంలో బసచేస్తారు. రేపు యాత్రను ప్రారంభించి సంగారెడ్డి చేరుకుంటారు. మొత్తంగా ఇవాళ 27.8 కిలోమీటర్ల మేర నడవనున్నారు. హైదరాబాద్‌లో నిన్న జరిగిన భారత్ జోడో యాత్రకు భారీగా స్పందన వచ్చింది. జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాంగ్రెస్ శ్రేణులతో పాతబస్తీ వీధులు నిండిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మల్లిఖార్జున ఖర్గే తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.