NTV Telugu Site icon

Boy in Borewell: విషాదం.. 4 రోజుల క్రితం బోరుబావిలో పడిన బాలుడు మృతి

Boy In Borewell

Boy In Borewell

Boy in Borewell: మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోని మాండవి గ్రామంలో డిసెంబర్ 6న 55 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది. బేతుల్ జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం రాత్రి ఆడుకుంటున్న ఓ బాలుడు బోరుబావిలో పడ్డాడు. ఈ దుర్ఘటన గురించి సమాచారం అందటంతో పోలీసులు, జిల్లా అధికారులు హుటాహుటిన బోరు బావి వద్దకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.బాలుడి కదలికలను పర్యవేక్షించేందుకు బోర్‌వెల్‌లో కెమెరాను అమర్చామని తెలిపారు. బోర్‌వెల్,టన్నెల్‌లో ఆక్సిజన్ సరఫరా కోసం ఏర్పాట్లు చేశారు. కానీ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చింది. రెస్క్యూ ఆపరేషన్‌లో బాలుడు ప్రాణాలు కోల్పోయాడని బేతుల్ జిల్లా పరిపాలన విభాగం శనివారం వెల్లడించింది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు దుర్మరణం

8 ఏళ్ల తన్మయ్ సాహు డిసెంబర్ 6న సాయంత్రం 5 గంటల సమయంలో పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. తర్వాత గంటలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్), హోంగార్డు, స్థానిక పోలీసు సిబ్బంది గత నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. తన్మయ్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో బేతుల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బాలుడి కుటుంబం పలు ప్రశ్నలను లేవనెత్తింది. వెంటనే తమ కుమారుడిని రక్షించాలని వేడుకుంది. తన్మయ్‌ తల్లి జ్యోతి సాహు ఆవేదన వ్యక్తం చేస్తూ.. “నా బిడ్డను నాకు ఇవ్వండి, అది ఏమైనా కావచ్చు. అదే ఒక నాయకుడి లేదా అధికారి బిడ్డ అయినా ఇంత సమయం పట్టేదా?” అంటూ ప్రశ్నించింది.