Gun Fire in Chicago: అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తుపాకీ.. కాల్పుల్లో ఎనిమిది మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire: అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. తాజాగా, యూఎస్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇల్లినాయిస్‌లోని చికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. కాల్పుల తర్వాత అక్కడి నుంచి దుండగుడు పరారయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి కోసం పోలీస్ అధికారులు గాలిస్తున్నారు. నగరంలో జోలియట్‌లోని వెస్ట్ ఎకర్స్ రోడ్‌లో ఉన్న 2200 బ్లాక్‌లో ఈ కాల్పులు జరిగినట్లు.. అలాగే, నిందితుడిని రోమియో నాన్స్ గుర్తించాం.. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని స్థానిక అధికారులు తెలిపారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడు.. ఈ కాల్పులు మొత్తం ఎనిమిని మంది మృత్యువాతపడ్డారని జోలియట్ పోలీసు చీఫ్ బిల్ ఎవాన్స్ చెప్పుకొచ్చాడు.
Read Also: TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ రేసులో మాజీ డీజీపీ..?
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
అయితే, కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నిందితుడు నాన్స్ నివసిస్తాడని జోలియట్ పోలీస్ చీఫ్ తెలిపారు. ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో నిందితుడు పరారైనట్టు సమాచారం.. అతడి దగ్గర గన్ ఉంది.. అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించాలని అక్కడి పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అలర్ట్ చేసింది. నాన్స్‌కు సంబంధించిన సమాచారం ఏమైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే 875 తుపాకీ కాల్పుల మరణాలు నమోదు అయినట్లు అనేక గణాంకాలు చెప్తున్నాయి.
ACTIVE INCIDENT (UPDATED) JANUARY 22, 2024 3:00 PM
At this moment, Detectives and Officers are conducting an active homicide investigation after Officers located multiple deceased individuals who had sustained gunshot wounds in two homes in the 2200 block of West Acres Road. pic.twitter.com/zOTKSjs0RC— Joliet Police Department (@JolietPolice) January 22, 2024
తాజావార్తలు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!