Site icon NTV Telugu

Gun Fire in Chicago: అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తుపాకీ.. కాల్పుల్లో ఎనిమిది మంది మృతి

Chikago

Chikago

Gun Fire: అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. తాజాగా, యూఎస్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇల్లినాయిస్‌‌లోని చికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. కాల్పుల తర్వాత అక్కడి నుంచి దుండగుడు పరారయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి కోసం పోలీస్ అధికారులు గాలిస్తున్నారు. నగరంలో జోలియట్‌లోని వెస్ట్ ఎకర్స్ రోడ్‌లో ఉన్న 2200 బ్లాక్‌లో ఈ కాల్పులు జరిగినట్లు.. అలాగే, నిందితుడిని రోమియో నాన్స్‌ గుర్తించాం.. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని స్థానిక అధికారులు తెలిపారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడు.. ఈ కాల్పులు మొత్తం ఎనిమిని మంది మృత్యువాతపడ్డారని జోలియట్‌ పోలీసు చీఫ్ బిల్ ఎవాన్స్ చెప్పుకొచ్చాడు.

Read Also: TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రేసులో మాజీ డీజీపీ..?

అయితే, కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నిందితుడు నాన్స్ నివసిస్తాడని జోలియట్ పోలీస్ చీఫ్ తెలిపారు. ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో నిందితుడు పరారైనట్టు సమాచారం.. అతడి దగ్గర గన్ ఉంది.. అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించాలని అక్కడి పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అలర్ట్ చేసింది. నాన్స్‌కు సంబంధించిన సమాచారం ఏమైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే 875 తుపాకీ కాల్పుల మరణాలు నమోదు అయినట్లు అనేక గణాంకాలు చెప్తున్నాయి.

Exit mobile version