Site icon NTV Telugu

Turkey: హోటల్ అగ్నిప్రమాదంలో 78 మంది మృతి.. యజమానితో సహా 11 మందికి జీవిత ఖైదు

Turky

Turky

భారీ అగ్నిప్రమాద కేసులో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు టర్కీ కోర్టు శుక్రవారం ఒక హోటల్ యజమానితో పాటు మరో 10 మందికి జీవిత ఖైదు విధించింది. జనవరి 21న 12 అంతస్తుల గ్రాండ్ కార్టెల్ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 78 మంది మృతి చెందగా, 133 మంది గాయపడ్డారు. హోటల్ యజమాని హాలిత్ ఎర్గుల్, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, హోటల్ మేనేజర్లు, డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఫైర్ చీఫ్ లు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కోర్టు దోషులుగా నిర్ధారించింది.

Also Read:Mass Jathara Review: మాస్ జాతర రివ్యూ.. రవితేజా హిట్టు కొట్టాడా లేదా?

పిల్లల మరణాలకు జీవిత ఖైదు విధించారు. 44 ఇతర మరణాలకు అదనంగా 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. నేరారోపణ ప్రకారం, తెల్లవారుజామున 3:17 గంటలకు మంటలు చెలరేగాయి. ఏడు నిమిషాల తర్వాత ఉద్యోగులు మంటలను గమనించారు, కానీ రెండు నిమిషాల్లోనే మంటలు అదుపు తప్పి భారీ ప్రాణ నష్టాన్ని కలిగించాయి.

Exit mobile version