NTV Telugu Site icon

boAt Airdopes Offers: అమెజాన్‌లో భారీ ఆఫర్‌.. బోట్‌ బడ్స్‌పై 73 శాతం డిస్కౌంట్!

Boat Airdopes 141 Anc Tws

Boat Airdopes 141 Anc Tws

boat Airdopes Offers in Amazon: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌కి భారీగా డిమాండ్‌ ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొనే.. అధునాతన ఫీచర్లతో కూడిన బడ్స్‌ను కంపెనీలు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. దాంతో యూజర్లు తప్పక కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. బడ్స్‌ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. ప్రస్తుతం బడ్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి.

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో బోట్‌ ఎయిర్‌ పాడ్స్‌పై భారీ ఆఫర్‌ అందిస్తోంది. బోట్‌ ఎయిర్‌ పాడ్స్‌ 141 ఏఎన్‌సీ ఇయర్‌ బడ్స్‌పై 73 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ బడ్స్‌ అసలు ధర రూ.5,990 కాగా.. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1599కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ.50 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ బడ్స్‌ను మీరు రూ.1550కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: AUS vs IND: పుజారా, రహానే స్థానాలకు ఆ ఇద్దరే సరైనోళ్లు: డీకే

బోట్‌ ఎయిర్‌పాడ్స్‌ 141లో 32 డీబీ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సేలేషన్‌ ఫీచర్‌ను ఇచ్చారు. దీంతో క్వాలిటీతో కూడిన ఆడియో అనుభూతిని పొందొచ్చు. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే 42 గంటల పాటు పనిచేస్తుంది. వాయిస్‌ కాల్స్‌ నాణ్యతను మరింత పెంచేందుకు ఇందులో ఈఎన్‌ఎక్స్‌ టెక్నాలజీని అందించారు. వీటిని 10 నిమిషాలు రీఛార్జ్‌ చేస్తే.. ఏకంగా 150 నిమిషాల పాటు పనిచేస్తుంది. ఇందులో 5.1 బ్లూటూత్‌కు సపోర్ట్ చేస్తాయి. యూఎస్‌బీ టైప్‌సీ పోర్టును ఇచ్చారు.

Show comments