Site icon NTV Telugu

71st Miss World Winner: మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్రిస్టినా పిజ్కోవా

New Project (45)

New Project (45)

71st Miss World Winner: ఎట్టకేలకు ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 71వ ప్రపంచ సుందరి పేరు వెల్లడైంది. ఈ అందాల పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా గెలుపొందగా, లెబనాన్‌కు చెందిన యాస్మినా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. మిస్ వరల్డ్ ఫైనల్ మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. అక్కడ క్రిస్టినా పేరు విజేతగా ప్రకటించారు. ఆమె కిరీటం దక్కించుకుంది. ఈ ఏడాది 120 మంది ఈ అందాల భామలు పోటీలో పాల్గొన్నారు. అందరినీ వెనక్కి నెట్టి క్రిస్టినా పిజ్కోవా టైటిల్‌ను గెలుచుకుంది. చివరిసారి ఈ పోటీలో పోలాండ్ నివాసి కరోలినా బిలావ్స్కా గెలిచారు. క్రిస్టినా పిజ్కోవాకు పట్టాభిషేకం చేసింది ఆమె.

Read Also:KTR : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటుదాం

ఈ పోటీలో భారతదేశం తరపున సినీ శెట్టి పాల్గొన్నారు. కానీ ఆమె ఈ టైటిల్‌ను గెలవలేకపోయింది. ఆమె టాప్-8కి చేరుకోవడంలో విజయం సాధించింది. కానీ టాప్ 4 కంటెస్టెంట్స్ ఎంపికైనప్పుడు, ఆమె అందులో చేరలేకపోయింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునే రేసు నుండి నిష్క్రమించింది. ఆమెది కర్నాటక. తన విద్యాభ్యాసం ముంబైలో పూర్తయింది. ఆమె 2022లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.

Read Also:Sela Tunnel: సేలా టన్నెల్‌ జాతికి అంకితం చేసిన మోడీ

కరణ్ జోహార్ హోస్ట్
ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఈ ఈవెంట్‌కు హోస్టుగా వ్యవహరించారు. 2013లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మేగన్ యంగ్ అతనికి మద్దతుగా నిలిచారు. నేహా కక్కర్, ఆమె సోదరుడు టోనీ కక్కర్, షాన్ వంటి ప్రముఖ గాయనీమణులు తమ అభినయం, గాత్రంతో అందాల ప్రదర్శనను అలరించారు. 28 ఏళ్ల తర్వాత భారత్‌లో మిస్‌ వరల్డ్‌ నిర్వహించడం జరిగింది. అంతకుముందు 1996 సంవత్సరంలో46వ ఎడిషన్ భారతదేశంలో నిర్వహించబడింది. ఈసారి ముంబై నగరం అందుకు వేదిక కాగా, 28 ఏళ్ల క్రితం బెంగళూరులో జరిగింది.

Exit mobile version