Site icon NTV Telugu

Noise Pop Buds Price: సరికొత్త టెక్నాలజీతో ‘నాయిస్‌ పాప్‌ బడ్స్‌’.. 50 గంటల బ్యాటరీ లైఫ్! 71 శాతం తగ్గింపు

Noise Pop Buds

Noise Pop Buds

Noise Pop Buds Launch and Price in India: ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ‘నాయిస్‌’ భారత్‌లో మరో కొత్త ప్రొడక్ట్‌ను రిలీజ్ చేసింది. సరికొత్త టెక్నాలజీతో ‘నాయిస్‌ పాప్‌ బడ్స్‌’ను విడుదల చేసింది. ఈ ట్రూవైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌లో క్వాడ్‌ మైక్‌ సిస్టమ్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌, IPX5 వాటర్ స్ప్లాషింగ్‌తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు అన్ని యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిచనున్నాయి. ఈ బడ్స్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌, నాయిస్‌ ఇండియా వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో నాయిస్‌ పాప్‌ బడ్స్‌ను రూ.999కి సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్‌ సేవింగ్‌ డేస్‌’ సేల్‌ 2024 కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా 71 శాతం తగ్గింపు అనంతరం రూ.999కి అందుబాటులో ఉంది. ఈ బడ్స్‌ అసలు ధర రూ.3,499గా ఉంది. ఈ అవకాశం కొద్దిరోజులు మాత్రమే ఉండనుంది. ఫారెస్ట్‌ పాప్‌, లైలాక్‌ పాప్‌, మూన్‌ పాప్‌, స్టీల్‌ పాప్‌ రంగుల్లో నాయిస్‌ పాప్‌ బడ్స్‌ లభిస్తోంది.

Also Read: Nitish Reddy: డేవిడ్ వార్నర్ సరసన తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి!

అత్యాధునిక నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీతో కాల్స్‌ క్లారిటీ పెంచేలా క్వాడ్‌ మైక్‌ సిస్టమ్‌ను నాయిస్‌ పాప్‌ బడ్స్‌లో ఇచ్చారు. ఇది పరిసర ప్రాంతాల్లోని అనవసరపు శబ్దాలను అరికడుతుంది. మీరు మంచి క్లారితో ఫోన్ కాల్‌లను మాట్లాడుకోవచ్చు. 10 ఎంఎం డ్రైవర్స్‌ను ఇందులో ఇచ్చారు. బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీ, హైపర్‌ సింక్‌ టెక్నాలజీ, గూగుల్‌ అసిస్టెంట్‌, సిరి వంటివి ఇందులో ఉంటాయి. 90 నిమిషాల్లో ఇది పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 10 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే.. 150 నిమిషాల బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. ఈ బడ్స్‌లో కేస్‌తో కలిపి పూర్తి ప్లేబ్యాక్‌ టైమ్‌ 50 గంటలు.

Exit mobile version