Digital Arrest: ఎయిర్‌టెల్ అధికారిగా, ముంబై పోలీసులగా నటిస్తూ.. 70 ఏళ్ల మహిళ ఖాతా నుంచి రూ.78.89 లక్షలు స్వాహా
- డిజిటల్ అరెస్ట్ ఘటన
- 70 ఏళ్ల మహిళ ఖాతా నుంచి రూ.78.89 లక్షలు స్వాహా
- గురుగ్రామ్‌లో నివసిస్తున్న 70 ఏళ్ల మహిళను డిజిటల్‌గా అరెస్టు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ ఘటనలు ఎక్కువై పోతున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించుకునేందుకు కొందరు వ్యక్తులు అడ్డదార్లు తొక్కుతూ అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. నకిలీ పోలీసు అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్ళు గురుగ్రామ్‌లో నివసిస్తున్న 70 ఏళ్ల మహిళను డిజిటల్‌గా అరెస్టు చేశారు. ఆమె బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్‌ను మనీలాండరింగ్ కోసం ఉపయోగించావని బెదిరించారు. ఆమె ఖాతాలను తనిఖీ చేసే పేరుతో నిందితులు రూ. 78,89,000 బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ వృద్ధురాలు శనివారం సైబర్ పోలీస్ స్టేషన్ సౌత్‌లో ఫిర్యాదు చేసింది.
Also Read
సెక్టార్ 67 M3M మెర్లిన్ సొసైటీకి చెందిన తమితా సేథి, నవంబర్ 22న తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఎయిర్‌టెల్ నుంచి పరిచయం చేసుకున్నాడని తెలిపింది. తన ఫోన్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారని నిందితుడు చెప్పినట్లు వెల్లడించింది.
ఆ తర్వాత, నవంబర్ 25న, ఆమెకు మరో వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను ముంబై పోలీసునని పరిచయం చేసుకున్నాడు. తనను డిజిటల్‌గా అరెస్టు చేస్తున్నట్లు చెప్పాడు. తన ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతాలను మనీలాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారని చెప్పాడు. వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తి పోలీసు యూనిఫాంలో, వెనుక భాగంలో జెండాతో ఉన్నట్లు కనిపించడంతో నిజమేనని భావించినట్లు బాధిత మహిళ తెలిపింది.
Also Read:AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకే జీవోలో ఇద్దరు సీఎస్ల నియామకం..
ఆ నకిలీ పోలీసు అధికారి ఆ వృద్ధ మహిళ నుంచి ఆమె ఖాతా లావాదేవీలు గురించి సమాచారం పొందాడు. తరువాత, ఆమె ఖాతాలను తనిఖీ చేసే కారణంతో, రూ. 78,89,000 ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకున్నాడు. దర్యాప్తు పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి ఇస్తామని ఆమెకు చెప్పాడు. కానీ డబ్బు తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!