NTV Telugu Site icon

Need Lover: లవర్ కోసం వెదుకుతున్న 70 ఏళ్ల వృద్ధుడు.. కండిషన్స్ కూడా సుమీ..

Need Lover

Need Lover

ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, ప్రేమ ఏ వయసులోనైనా దొరుకుతుందని చాలామంది అంటుంటారు. 60 ఏళ్ల పైబడి వారు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. 70 ఏళ్ల వృద్ధుడు తన నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు అల్ గిల్బర్టీ. అమెరికా లోని టెక్సాస్ నివాసి ఈయన. ఒంటరిగా ఉండడంతో విసిగిపోయానని, అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అందుకే అమ్మాయి కోసం చూస్తున్నానని చెప్పాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.., అతను అమ్మాయి కోసం భారీ మొత్తంలో రూపాయలు ఖర్చు చేసి చాలా ప్రకటనలు ఇస్తున్నాడు.

Also read: Raghav chadha: రాఘవ్ చద్దా కంటిచూపుపై ఢిల్లీ మంత్రి ఏమన్నారంటే..!

గిల్బెర్టీ తన ఫోటోను ఎత్తైన రోడ్‌సైడ్ బిల్‌ బోర్డ్‌ పై 20 అడుగులతో ఉంచాడు. పెళ్లి చేసుకుని కచేరీని ఎంజాయ్ చేయాలనీ ఆలోచిస్తున్నట్లు కూడా రాశారు. గిల్బర్టీ తన ప్రకటన పనిచేసిందని చెప్పాడు. కేవలం రెండు వారాల్లోనే అతనికి 400కు పైగా కాల్స్, 50 ఇమెయిల్‌లు కూడా వచ్చాయి. తనను పెళ్లి చేసుకోవాలనే కోరికను అమ్మాయిలు వ్యక్తం చేశారని వివరించారు. గిల్బెర్టీ తన “మిస్ రైట్” ని త్వరలో కనుగొనాలని ఆశిస్తున్నట్లు నెటిజన్స్ ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు.

Also read: Karumuri Nageswara Rao: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

గిల్బెర్టి తన గురించి తాను చెప్పుకుంటూ.. చాలా వినయం, విధేయత కలవాడనని., తాను నిజాయితీగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. తగిన భాగస్వామి దొరికితే వారి కోసం అమెరికాలో ఎక్కడికైనా వెళతానని చెప్పాడు. నిజమైన ప్రేమ దొరికితే యూరప్ కూడా వెళతానని చెప్పాడు. అయితే అతని యాడ్ చూసిన చాలా మంది యువతులు అతను చాలా ధనవంతుడని భావించి, డబ్బు సహాయం కోసం తనకు ఫోన్ చేశారని గిల్బర్టీ చెప్పారు. నేను సరైన వ్యక్తిని కలవాలనుకుంటున్నాను. అయితే తన హృదయాన్ని మెచ్చుకునే యువతి నుంచి తనకు ఇంకా కాల్ రాలేదని చెప్పాడు.