Site icon NTV Telugu

Physical Harassment: 7 ఏళ్ల బాలికపై పాల వ్యాపారి అత్యాచారం

Physical Harassment

Physical Harassment

Physical Harassment: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నా రులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. తాజాగా జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో ఏడేళ్ల బాలికపై ఓ పాల వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 40 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 180 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Read Also: Gold Mine Fire: బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

నిందితుడు పాలు సరఫరా చేసేందుకు ఇంటికి వచ్చినప్పుడు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. పాల వ్యాపారి మొబైల్ ఫోన్‌లో ఏదో చూపిస్తానని నమ్మించి ఆమెను ప్రలోభాలకు గురిచేశాడు. నిందితుడు ఆమెను పక్కనే నిర్మాణంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడ‌ని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రిషవ్ గార్గ్ తెలిపారు. బాలిక తల్లిదండ్రులు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సత్వర చర్యలు తీసుకుని నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. బాలికను పరీక్షల నిమిత్తం మేదినీనగర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి విచార‌ణ త‌ర్వాత మ‌రిన్ని వివ‌రాలు వెల్లడిస్తామ‌ని సంబంధిత ద‌ర్యాప్తు అధికారులు తెలిపారు.

Exit mobile version