NTV Telugu Site icon

Duleep Trophy: 7 వికెట్లు, 7 మెయిడిన్లు.. విరుచుకుపడ్డ బౌలర్, ఇంతకీ ఎవరు..?

Manav

Manav

దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా ‘సి’ వర్సెస్ ఇండియా ‘డి’ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా ‘సి’ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. జట్టు గెలుపొందడంలో స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. ఇండియా సి తరఫున రెండో ఇన్నింగ్స్‌లో 19.1 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా.. అందులో ఏడు మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు. 233 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ సి.. మానవ్ సుతార్ అద్భుత బౌలింగ్తో ఇండియా డి జట్టును కుప్పకూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా డి 164 పరుగులు చేయగా, ఇండియా సి 168 పరుగులు చేసింది.

Anirudh: పాపం అనిరుధ్.. ఏం చేసినా ట్రోలింగే?

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో జన్మించిన సుతార్.. అతని తండ్రి బ్యాట్స్‌మెన్‌ కావాలని కోరుకున్నాడు. అయితే.. సుతార్ తన కోచ్ ధీరచ్ నిర్ణయాత్మక సలహాతో అతని తండ్రి కోరికలకు విరుద్ధంగా వ్యవహరించాడు. ఈ విషయాన్ని స్వయంగా మానవ్ సుతార్ మీడియాతో చెప్పాడు. అతను ఫిబ్రవరి 2022లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో సుతార్ మాట్లాడుతూ.., “ప్రపంచాన్ని భయపెట్టే బ్యాట్స్‌మన్‌లా తయారు చేయమని మా నాన్న కోచ్‌తో చెప్పారు. అయితే.. నా కోచ్, ‘నన్ను స్పిన్నర్‌గా తయారు చేశారు.” అని సుతార్‌ తెలిపాడు. మరోవైపు.. కోచ్ ధీరజ్ మాట్లాడుతూ, అతను ప్రతిభావంతుడైన స్పిన్నర్ అని చెప్పాడు. అతను బంతిని పట్టుకునే విధానం తనను ఆకట్టుకుందని అన్నాడు. 12 సంవత్సరాల వయస్సులో చాలా మంది అబ్బాయిలకు అలాంటి పట్టు ఉండదు.. కానీ సుతార్ లో ఉందని తెలిపాడు.

Aditi Shankar: బెల్లం బాబు కోసం స్టార్ డైరెక్టర్ కూతురు?

Show comments