7/G Brundavan Colony : అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తున్న కల్ట్ క్లాసిక్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
7/G బృందావన్ కాలనీ ఈ కల్ట్ క్లాసిక్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2004లో రిలీజైన ఈ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.రవికృష్ణ, సోనియా అగర్వాల్ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువర్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ మరియు పాటలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.అలాగే సెల్వరాఘవన్ టేకింగ్‌పై ప్రశంసలు కూడా దక్కాయి. యూత్ ఆడియెన్స్‌ను ఈ సినిమా ఎంతగానో మెప్పించింది.తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా సేమ్ టైటిల్‌తో రిలీజైంది. ఈ కల్ట్ క్లాసిక్ మూవీ సెప్టెంబర్ 22 న ఎంతో గ్రాండ్ గా రీ రిలీజ్ అయింది.
రీ రిలీజ్‌లో కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతుంది.. మూడు రోజుల్లోనే ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.మూడో రోజు కూడా ఈ ప్రేమకథా చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి.ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవడం 7/G బృందావన కాలనీకి కలిసి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రిలీజైన ఈ కల్ట్ క్లాసిక్ సినిమా తొలిరోజే కోటికిపైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు అరవై లక్షలు, మూడో రోజు యాభై లక్షల వరకు వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తెలుగులో రీ రిలీజైన తమిళ డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ దక్కించుకున్న మూవీస్‌లో ఒకటిగా 7/G బృందావన కాలనీ నిలిచింది.త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో హీరో రవికృష్ణ పేర్కొన్నాడు. సోనియా అగర్వాల్ మినహా మిగిలిన ప్రధాన పాత్రధారులందరూ ఈ సీక్వెల్‌లో కనిపించబోతున్నట్లుతెలుస్తుంది.
Also Read
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
తాజావార్తలు
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!