Site icon NTV Telugu

Exotic Animals Seized: అక్రమంగా తరలిస్తున్న 665 అరుదైన, అన్యదేశ జంతువులు సీజ్‌..

Rare Animals

Rare Animals

Exotic Animals Seized: మహారాష్ట్రలో అక్రమంగా తరలిస్తున్న అరుదైన, అన్యదేశ జీవులను అధికారులు సీజ్ చేశారు. జీవులను అక్రమంగా తరలిస్తు్న్నట్లు సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే రైడ్‌ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐకి చెందిన ముంబయి యూనిట్‌ అధికారులు వీటిని పట్టుకున్నారు. ముంబైలోని ఎయిర్‌ కార్గో కాంప్లెక్స్‌లో దిగుమతి సరుకులో వీటిని గుర్తించారు.

Welcome to Delivery Boy: జొమాటో డెలివరీ బాయ్‌కు ఘన స్వాగతం.. హారతిచ్చి మరీ.. కారణమేంటో?

దిగుమతి చేసుకునే సరుకులో దిగుమతి నిషేధించబడిన అరుదైన మరియు అన్యదేశ జాతులు ఉండవచ్చని సమాచారం అందిందని డీఆర్‌ఐ తెలియజేసింది. ఈ నేపథ్యంలో అధికారులు రైడ్‌ చేయగా.. కొండ‌చిలువ‌లు, తాబేళ్లు, బ‌ల్లులు స‌హా మొత్తం 665 జీవులు ఉన్నాయి. కొన్ని అత్యంత అరుదుగా క‌నిపించే విల‌క్షణ జాతుల జీవులు కూడా ప‌ట్టుబ‌డ్డాయి. నిందితులు చేప‌ల‌ను త‌ర‌లించే పెట్టెల్లో ఈ జీవులను దాచి అక్రమంగా ముంబైకి త‌ర‌లించిన‌ట్లు అధికారులు చెప్పారు. అటవీ శాఖ, వన్యప్రాణి క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. డీఆర్‌ఐ ప్ర ప్రకారం, జంతువులను దేశంలోకి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందున, కస్టమ్స్ చట్టం, విదేశీ వాణిజ్య అభివృద్ధి (నియంత్రణ) చట్టం కింద జంతువులను స్వాధీనం చేసుకున్నారు. జీవులను సీజ్ చేసిన అధికారులు.. వాటిని బ‌య‌టి నుంచి ముంబైకి తీసుకొచ్చిన వ్యక్తిని, ముంబైలో డెలివ‌రీ తీసుకోబోయే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసులో త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

Exit mobile version