Site icon NTV Telugu

YSR Pension Kanuka: హామీని సంపూర్ణంగా నెరవేర్చిన సీఎం జగన్‌.. ఇకపై ప్రతినెలా రూ.3వేలు..

Ysr Pension Kanuka

Ysr Pension Kanuka

YSR Pension Kanuka: కొత్త సంవత్సరం నేపథ్యంలో ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంచింది సర్కారు. విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ.3వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్. వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక కింద ఇకపై ప్రతినెలా రూ. 3వేల పెన్షన్ ఇవ్వనున్నారు.
– 2014-19లో గత పాలనలో పెన్షన్‌ రూ.1000
– జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు.
– జనవరి 2022న రూ.2,500కు పెన్షన్‌ పెంపు.
– జనవరి 2023న రూ. 2,750కు పెంపు.
– జనవరి 2024న రూ.3వేలకు పెంపు.

పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెరిగింది. ఆ పెరిగిన సగటు వ్యయాలు ఇలా ఉన్నాయి.
– 2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు.
– జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లు.
– జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు.
– జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు.
– జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1968 కోట్లు.

గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. 5 ఏళ్లలో అంటే 60 నెలల్లో గత ప్రభుత్వం పెన్షనర్లకు చేసిన ఖర్చు రూ.27,687 కోట్లు మాత్రమే. ఇచ్చిన మాట ప్రకారం ఈప్రభుత్వం నెలకు రూ.300 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడిచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు.

– పెన్షన్‌ లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.34లక్షలకు పెంపు:
– గత ప్రభుత్వంలో 2014-19 మధ్య లబ్ధిదారులు 39 లక్షలు.
– 2019లో పెన్షన్‌ లబ్ధిదారులు రూ.52.17 లక్షలు.
– 2022లో పెన్షన్‌ లబ్ధిదారులు రూ.62 లక్షలు.
– 2023లో పెన్షన్‌ లబ్ధిదారులు రూ.64.45 లక్షలు.
– 2024లో పెన్షన్‌ లబ్ధిదారులు రూ.66.34 లక్షలు.

Exit mobile version