NTV Telugu Site icon

Galaxy S23 FE Price: 62 శాతం తగ్గింపు.. 30 వేలకే ‘గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ’! బ్యాంకు ఆఫర్స్ అదనం

Samsung Galaxy S23 Fe

Samsung Galaxy S23 Fe

Samsung Galaxy S23 FE Flipkart Offers: ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఫ్లిప్‌కార్ట్‌’ ఏటా నిర్వహించే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్ సెప్టెంబర్‌ 27 నుంచి ఆరంభం అయింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై బరిగా డిస్కౌంట్లు అందిస్తోంది. కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ మీరు అస్సలు ఊహించలేరు. ‘శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ’ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఎత్తున రాయితీ ఇస్తోంది. అదనంగా బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈని తక్కువకే సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ 8జీబీ+128జీబీ వేరియంట్‌ అసలు ధర రూ.79,999గా ఉంది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2024 సేల్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై 62 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. దాంతో రూ.29,999కే అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఈఎంఐపై కొనుగోలు చేస్తే 10 శాతం (గరిష్టంగా 1500) తగ్గింపు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1000 తగ్గుతుంది. గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈని రూ.28,499కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: MS Dhoni-IPL 2025: ఎంఎస్ ధోనీ కోసమే కొత్త రూల్.. సీఎస్‌కేకు భారీ లాభం!

గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ ఫీచర్స్:
# 6.4 ఇంచెస్ అమోలెడ్‌ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే
# ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌
# ఎక్సినోస్‌ 2200 ప్రాసెసర్
# ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌
# 50 ఎంపీ +8 ఎంపీ +12 ఎంపీ కెమెరాలు
# 10 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ (25వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌)

Show comments