Site icon NTV Telugu

Crime News: దారుణం.. టీ గార్డెన్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

Crime News

Crime News

Crime News: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. తాజాగా అస్సాంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి అనంతరం దారుణంగా హత్య చేశారు. స్థానికులు సోనిత్‌పూర్ జిల్లాలో టీ తోట వద్ద ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధేకియాజులి సమీపంలోని ముహినిపూర్ టీ తోటలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకోవడానికి ఆపరేషన్ ప్రారంభించారు. సోనిత్‌పూర్ జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిరించి బోరా మాట్లాడుతూ.. పోలీసులు నిందితుడిని గుర్తించారని, త్వరలో అతన్ని పట్టుకుంటామని చెప్పారు.

Woman Birth to Five Children: ఏడుగురి తర్వాత.. ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జననం

ముహినీపూర్ టీ గార్డెన్‌లోని హాత్‌ఖులా లైన్‌లో బాలిక మృతదేహం బయటపడిందని పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ ప్రారంభించి నిందితుడిని గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామని బిరించి బోరా చెప్పారు. మరోవైపు నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు జిల్లా యంత్రాంగం, పోలీసులను డిమాండ్‌ చేశారు.

Exit mobile version