Site icon NTV Telugu

Smart Phone Camera Cleaning: మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఇలా క్లీన్ చేసుకోండి..

Smart Phone

Smart Phone

ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన కెమెరాలు కలిగిన అనేక ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు 200 మెగా పిక్సెల్ కెమెరాతో Realme 11 Pro+ భారత్ లో స్టార్ట్ చేశారు. ఫోటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే వారు అధిక మెగా పిక్సెల్ కెపాసిటీ ఉన్న మొబైల్ ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు అనే తేడా లేకుండా అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవడం కూడా మీదే బాధ్యతే. ఫోన్ కెమెరా పూర్తిగా క్లీన్ గా ఉన్నప్పుడే మీరు మంచి ఫోటోస్ ను తీయగలరు. అలాగే క్లారిటీగా ఫోటో కూడా వస్తుంది. చాలా మంది ఫోన్ కెమెరాను శుభ్రం చేయకుండానే వినియోగిస్తుంటారు. కానీ దీన్ని ఇంట్లో ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలు మీకోసం..

Read Also: Uttar Pradesh: బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిపై బుల్డోజర్ యాక్షన్..

1. కెమెరాను క్లీన్ గా ఉంచుకోవడానికి ముందుగా స్మార్ట్‌ఫోన్‌ను బాగా చూసుకోవాలి. అంటే ఇంట్లో లేదా ఆఫీసులో ఫోన్‌ని పరిశుభ్రమైన ప్లేస్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ కెమెరాను క్లీన్ గా ఉంటుంది.
2. స్మార్ట్‌ఫోన్ కెమెరాను శుభ్రపరిచేటప్పుడు మీ మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేయాలి. క్లీన్ చేయడానికి మృదువైన మైక్రోఫైబర్ క్లాత్ ను ఉపయోగించాలి.. కఠినమైన బట్టతో కెమెరాను శుభ్రం చేస్తే.. కెమెరా గ్లాస్‌పై మరకలు పడతాయి.
3. లెన్స్ క్లీనర్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని ద్వారా కెమెరా, ఎల్ఈడీ లైట్లు(LED Light), సెన్సార్లను శుభ్రం చేయవచ్చు. దీంతో ఫోటో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ లెన్స్ క్లీనర్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

Read Also: Viral News: కుక్క తప్పిపోయిందని పోలీసులను తిప్పలు పెడుతున్న మున్సిపల్ కమిషనర్. దాదాపు 500 ఇళ్లలో సోదాలు..!

4 కెమెరాకు నేరుగా లెన్స్ క్లీనర్‌ను ఎప్పుడూ ఉపయోగించకూడదు. అది కెమెరా, ఫోన్‌కు ప్రమాదకరమైనది. అలాగే, కెమెరాను శుభ్రపరిచేటప్పుడు చేతులతో ఎక్కువ గట్టిగ నొక్కకూడదు.
5. స్మార్ట్‌ఫోన్ కెమెరాను క్లీన్ చేసేటప్పుడు నీటిని పొదుపుగా ఉపయోగించాలి. మొత్తానికి ఫోన్‌లో నీరు చేరితే మదర్‌బోర్డు పాడయ్యే ఛాన్స్ ఉంది. అలాగే, కెమెరాను తడి క్లాత్ తో శుభ్రం చేయకూడదు.
6. హార్డ్ బ్రష్‌తో కెమెరాను శుభ్రం చేయవద్దు. చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేయడానికి బ్రష్‌ను వినియోగిస్తారు. అది మెత్తగా ఉంటే సమస్య లేదు. కానీ రఫ్ గా ఉంటే మాత్రం కెమెరా పాడయ్యే ఛాన్స్ ఉంది.

Exit mobile version