NTV Telugu Site icon

Rajasthan: హైవేపై ట్రక్కు యూటర్న్.. దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి

Acci 2

Acci 2

ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హైవేపై ట్రక్కు దూసుకెళ్తుండగా హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు. అంతే వెనుక నుంచి వస్తున్న కారు దాంట్లోకి దూసుకుపోయింది. అక్కడికక్కడే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఘోరం జరిగింది. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారి, ఆర్‌ఎల్‌పీ నేత హనుమాన్ బెనివాల్ సంతాపం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Elephant attack: ఏనుగుల దాడిలో ప్రముఖ న్యూస్ ఛానెల్ కెమెరామెన్ మృతి..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిని జైపూర్‌కు తరలించి చికిత్స అందించడంతో క్షేమంగా ఉన్నారని అడిషనల్ ఎస్పీ దినేష్ కుమార్ తెలిపారు. సికార్ జిల్లాలోని ఖండేలాకు చెందిన ఒక కుటుంబం సవాయ్ మాధోపూర్‌లోని గణేష్ ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వెళుతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Ian Gelder: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు కన్నుమూత

మృతులు మనీష్ శర్మ, అతని భార్య అనితా శర్మ, సతీష్ శర్మ, పూనమ్, అతని అత్త సంతోష్, అతని స్నేహితుడు కైలాష్‌గా గుర్తించారు. మనన్, దీపాలి అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడం బాధాకరమని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Palnadu: పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు కలకలం