Assam and Meghalaya Border Firing : అసోం-మేఘాలయ రాష్ట్రాల మధ్య మళ్లీ హింస చెలరేగింది. అసోంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని బోర్డర్ లో జరిగిన కాల్పుల ఘటనలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఐదుగురు మేఘాలయకు చెందిన వారు కాగా, ఒకరు అసోం ఫారెస్ట్ గార్డ్. కలపను స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్కును అసోం అటవీ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్మగ్లర్లు వాహనాన్ని ఆపకపోగా మరింత వేగంగా పోనియడంతో… ఛేజ్ చేసిన ఫారెస్ట్ గార్డులు కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Read Also: China Fire Accident: చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది సజీవ దహనం
Read Also:Hyderabad Traffic: హైదరాబాద్ జనాలకు హై అలర్ట్.. మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు
ఈ ఘటనలో మేఘాలయకు చెందిన ఐదుగురితోపాటు అసోం ఫారెస్ట్ గార్డు కూడా చనిపోయినట్లు మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా ధ్రువీకరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. మరోవైపు, దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాగా, అసోం-మేఘాలయ మధ్య 884.9 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇందులో 12 వివాదాస్పద ప్రాంతాలున్నాయి. వీటిలో ఆరింటికి సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలు గత మార్చిలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో 70 శాతం సమస్య పరిష్కారమైందని అప్పట్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు.
