Site icon NTV Telugu

Truck Rams Into People: బస్టాప్‌లో ఉన్న జనాలపైకి దూసుకొచ్చిన ట్రక్కు.. 6గురు దుర్మరణం

Road Accident

Road Accident

Truck Rams Into People: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో రోడ్డు పక్కన బస్టాప్ వద్ద నిలబడి ఉన్న జనాలపైకి ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు వేగంగా దూసుకెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 10 మంది గాయపడగా.. వారిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. రత్లామ్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలోని రత్లాం-లెబాద్ రోడ్డులోని సత్రుండా గ్రామ సమీపంలో ట్రాఫిక్ కూడలి వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో పది మంది గాయపడ్డారని జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ తెలిపారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది.

Vladimir Putin: ఇంట్లో మెట్లపై నుంచి పడిపోయిన పుతిన్‌

ట్రక్కును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అభిషేక్ తివారీ తెలిపారు. వేగంగా వచ్చిన ట్రక్కు కనీసం 20 మందిని తాకిందని గాయపడిన వారిలో ఒకరైన విశాల్ తెలిపారు.ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ట్రక్కు వారిపైకి దూసుకురావడంతో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారని.. నలిగిపోయిన రెండు మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయని వారు తెలిపారు. లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడని వారు తెలిపారు.

Exit mobile version