NTV Telugu Site icon

Pakistan Blast: పాకిస్థాన్ లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 22 మందికి గాయాలు..

Pak

Pak

Bomb Blast In Pakistan: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఇవాళ పోలియో టీకాలు వేసే కార్మికులకు భద్రత కల్పించేందుకు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లాలోని మాముంద్ తహసీల్‌లో చోటు చేసుకుంది. అయితే, ఈ పేలుడు సంభవించినప్పుడు పోలీసులు పోలియో టీకా బృందాలతో భద్రతా విధుల్లో చేరడానికి వ్యాను ఎక్కారు.. కాగా, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.. దీంతో అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించారు.

Read Also: Ponnam Prabhakar: కుల వృత్తులను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది

కాగా, ఈ పేలుడులో ప్రమాదంలో గాయపడిన వారందరూ పోలీసులేనని పోలీసు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేపీకే అర్షద్ హుస్సేన్ దాడిని తీవ్రంగా ఖండించారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఉగ్రవాదంపై యుద్ధం కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. పోలియో టీకాను వ్యతిరేకిస్తున్నందున పాకిస్తాన్‌లోని పోలియో బృందాలు తరచూ ఉగ్రవాదుల చేత మరణించబడుతున్నారు. ఈ దాడికి బాధ్యులని ఇప్పటి వరకు ప్రకటించలేదు.. అయితే పాకిస్తాన్ తాలిబాన్‌తో సహా ఇస్లామిక్ తీవ్రవాదులు గతంలో అనేక మంది పోలియో టీకా కార్మికులతో పాటు వారిని రక్షించే పోలీసులపై బాంబు దాడి చేసి చంపేశారు.