Site icon NTV Telugu

YCP 5th List Tension: వైసీపీ ఐదో జాబితాపై కసరత్తు.. సీఎంవోలో కీలక నేతలు.. సిట్టింగ్‌ల్లో టెన్షన్‌..!

Ycp

Ycp

YCP 5th List Tension: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గానే సాగుతోంది.. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు ఐదో జాబితాపై ఫోక్‌ పెట్టింది.. ఐదవ జాబితాపై వైసీపీలో కసరత్తు కొనసాగుతోంది.. ఇవాళ, రేపటిలోగా ఐదవ జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు నేతలు క్యూ కట్టారు.. అంతే కాదు.. సీఎంవోలనే విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు తిష్టవేశారు.. సీఎంవోకు మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్, పొన్నాడ సతీష్, ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత బాబు తదితర నేతలు చేరుకున్నారు.

Read Also: They Call Him OG: పదిహేను రోజులిస్తే చాలు పాన్ ఇండియా షేక్ అయ్యే సినిమా రెడీ

సోమవారం రోజు సీఎం క్యాంప్ కార్యాలయానికి దాదాపు 20 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు.. ఇవాళ సీఎంవోకు మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్, పొన్నాడ సతీష్, ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత బాబు తదితర నేతలు చర్చలు జరుపుతున్నారు.. ఇదే సమయంలో వైసీపీలో కీలకంగా ఉన్న సజ్జల, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి కూడా అక్కడే ఉండే కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. 68 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో మార్పులు చేశారు. ఐదో జాబితాలో 15 నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.. అందులో భాగంగానే మార్పులు చేర్పులు జరిగే స్థానాలకు సంబంధించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు.. ఆ స్థానంలో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుంది అనే విషయాలపై కూడా ఫోకస్‌ పెట్టింది వైసీపీ అధిష్టానం.

Exit mobile version