They Call Him OG: పదిహేను రోజులిస్తే చాలు పాన్ ఇండియా షేక్ అయ్యే సినిమా రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చివరగా అనౌన్స్మెంట్ అయి జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకున్న సినిమా ఏదైనా ఉందా? అంటే, అది ఓజి అనే చెప్పాలి. సాహో తర్వాత సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఓజి పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా ఫస్ట్ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. అయితే సుజీత్ ఉన్న స్పీడ్‌కి ఈపాటికే ఓజి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని థియేటర్లోకి రావాల్సింది కానీ పవన్ పాలిటిక్స్ కారణంగా ప్రస్తుతం బ్రేక్‌లో ఉంది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనేది సస్పెన్స్‌గా మారింది. కానీ ఓజి ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఎందుకంటే పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.
ఇప్పటికే పవన్ లేని సీన్స్ కంప్లీట్ చేశాడట సుజీత్. దీంతో జస్ట్ పవన్ 17 నుంచి 18 రోజులు డేట్స్ ఇస్తే చాలు… షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. ప్రజెంట్ పవన్ ఎన్నికల హడావిడిలో ఉన్నారు కాబట్టి… ఆ తర్వాత డేట్స్ ఇస్తే వెంటనే ఓజిని పూర్తి చేసి ఆగస్ట్ వరకు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఆగస్టు టార్గెట్ ని అచీవ్ చేస్తే చాలు సుజిత్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయగలడు. ఇప్పటివరకు రీజనల్ సినిమాల కలెక్షన్స్ దగ్గర మాత్రమే కొత్త రికార్డులు క్రియేట్ చేసే పవన్ కళ్యాణ్… OG సినిమాతో మొదటిసారి రీజనల్ బౌండరీలు దాటి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. OG హిట్ అయితే సినిమా అభిమానులు మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సంభవం చూస్తారు. మరి ఈ ఆగస్టు టార్గెట్ ని సుజిత్ అచీవ్ చేస్తాడా? పవన్ కళ్యాణ్ బాలన్స్ డేట్స్ ని త్వరగా ఇస్తాడా లేదా అనేది చూడాలి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?