NTV Telugu Site icon

Libiya: లిబియాలో వరద బీభత్సం.. 5,300 కి పైగా చేరుకున్న మరణాలు

Floods

Floods

Libiya: లిబియాలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. సోమవారం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరద తాకిడికి పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో వేలమంది ప్రాణాలను కోల్పోయారు.అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. లిబియా నగరమైన డెర్నాలో 100,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా డేనియల్ తుఫాను కారణంగా సంభవించిన వరద మధ్యధరా తీర నగరమైన డెర్నాను అతలాకుతలం చేసింది. ఈ దుర్ఘటనలో 5,300 మందికి పైగా మరణించారు. వరద నీటి ఉదృతికి 10000 మందికి పైగా గల్లంతయ్యారు. 7000 క్షతగాత్రులయ్యారు. కాగా మరణాల సంఖ్య 10000 వేలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also:SBI Recruitment 2023: ఎస్బీఐలో ఉద్యోగాలు..6160 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న డెర్నా కు సాయం చేసేందుకు చాల దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు రెస్క్యూ బృందాలను డెర్నాకు పంపించారు. అత్యవసర సేవలను అందిస్తున్నారు. లిబియా సామాజిక మాధ్యమాల ప్రకారం ఎక్కడ చూసిన మృత దేహాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి.. దహన సంస్కారాలకు శ్మశాన వాటికలో క్యూ లో ఉండాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.. సోమవారం రోజే 300 కంటే ఎక్కువ మంది మృత దేహాలని ఖననం చేశారు.. ఇంకా ఖననం చేయాల్సిన మృత దేహాలు వందల్లో ఉన్నాయి. ఈ వరద దాటికి కార్లు, ఇళ్లు కనుమరుగయ్యాయి. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందని డెర్నా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం డెర్నా లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also:RBI New Order: బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ వార్నింగ్.. కస్టమర్లకు ఆ పత్రాలు ఇవ్వడం లేట్ అయితే జరిమానా