NTV Telugu Site icon

500 Rupee Note Holders: కరెన్సీ నోట్లు ఒకే నంబర్ కలిగి ఉంటే అవి చెల్లుబాటు అవుతాయా?

New Project

New Project

500 Rupee Note Holders: చాలా సార్లు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు చిరిగిపోయిన లేదా పాత నోట్లు వస్తుంటాయి. అప్పుడు వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్బీఐ(RBI) కొత్త మార్గదర్శకాల ప్రకారం మీ సమస్యలకు పరిష్కారం దొరకుతుంది.

100, 200, 500 రూపాయల నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. అయితే దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత వాటి గురించి అనేక రకాల ఫేక్ వార్తలు తెరపైకి వస్తున్నాయి. మీరు పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లను కూడా మార్చాలనుకుంటే ఇప్పుడు సులభంగా చేయవచ్చు. దీని కోసం మీ సమీప బ్యాంక్ శాఖను సంప్రదించవచ్చు. అక్కడ నోట్లు, నాణేలను మార్చుకోవచ్చు.

రెండు నోట్లు ఒకే క్రమ సంఖ్యను కలిగి ఉంటే, అవి చెల్లుబాటు అవుతాయా అన్న విషయంలో రిజర్వు బ్యాంక్ ఓ క్లారిటీ ఇచ్చింది. రిజర్వు బ్యాంక్ తెలిపిన ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ నోట్లు ఒకే క్రమ సంఖ్యను కలిగి ఉండవచ్చు, కానీ వేర్వేరు ఇన్సెట్ లెటర్స్ లేదా వేర్వేరు ప్రింటింగ్ సంవత్సరాలు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వివిధ గవర్నర్ల సంతకాలను కలిగి ఉండవచ్చు. ఇన్సెట్ లెటర్ అంటే నోటు నంబర్ ప్యానెల్‌పై ముద్రించిన అక్షరం.

రిజర్వ్ బ్యాంక్ కొన్ని రోజుల క్రితం ఒక ప్రకటనలో రూ.500 నోటు నకిలీదని.. అందులో ఆకుపచ్చ స్ట్రిప్ దగ్గర RBI గవర్నర్ సంతకం లేదని పేర్కొంది. సాధారణ పౌరులకు నిజమైన, నకిలీ రూ. 500 నోట్ల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనడంలో సహాయపడటానికి RBI మార్గదర్శకాల PDFని కూడా జారీ చేసింది.

Read Also: Kiccha Sudeep: బీజేపీలో చేరనున్న స్టార్ హీరోలు.. కాషాయ పార్టీలోకి కిచ్చా సుదీప్, దర్శన్

ఏ నోట్లు చెల్లుబాటు కావు..
– నోట్లు చాలా మురికిగా మారినట్లయితే, వాటిపై బాగా మట్టి పేరుకుపోయి ఉంటే అవి పనికిరానివిగా పరిగణించబడతాయి.
– నోట్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల నోట్లు వదులుగా మారుతాయి. అలాంటి నోట్లు పనికిరావు.
– అంచు నుండి మధ్యకు చిరిగిన నోట్లు పనికి రావు
– 8 చదరపు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ రంధ్రాలు ఉన్న నోట్‌లు పనికిరానివిగా పరిగణించబడతాయి.
– నోట్‌లో ఏదైనా గ్రాఫిక్ మార్పు అన్ ఫిట్ నోట్‌గా పరిగణించబడుతుంది.
-పెన్నుతో రాసినది పనికిరాని నోటు.
– నోటు రంగు మారిపోతే అది అన్ ఫిట్ నోటు.
-నోటుపై టేప్, జిగురు వంటివిఉంటే అవి పని చేయనివి.

RBI నిబంధన ఏం చెబుతుందో తెలుసా?
రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం, మీ వద్ద కూడా పాత లేదా మ్యుటిలేటెడ్ 500 రూపాయల నోట్లు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు బ్యాంకులోని ఏదైనా శాఖను సందర్శించడం ద్వారా అటువంటి నోట్లను మార్చుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగి మీ నోట్‌ని మార్చుకోవడానికి నిరాకరిస్తే, మీరు దీని గురించి ఫిర్యాదు కూడా చేయవచ్చు. నోటు పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే.. దాని విలువ తగ్గుతుంది.

Read Also: Cash Limit at home: ఇంట్లో ఎంత పరిమితి వరకు లిక్విడ్ క్యాష్ ఉంచుకోవచ్చో తెలుసా?

ఈ విషయాలను గుర్తుంచుకోండి
RBI ప్రకారం, ఏదైనా చిరిగిన నోటులో కొంత భాగం కనిపించకుండా పోయినప్పుడు లేదా రెండు కంటే ఎక్కువ ముక్కలను కలిగి ఉండి ఒకదానితో ఒకటి అతికించినప్పుడు మాత్రమే అంగీకరించబడుతుంది. కరెన్సీ నోటులోని కొన్ని ప్రత్యేక భాగాలు.. అంటే జారీ చేసే అధికారం, గవర్నర్ సంతకం, అశోక స్తంభం, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్ మార్క్ మొదలైనవి లేకుంటే, మీ నోటు మార్చబడదు. చాలా కాలంగా మార్కెట్‌లో చలామణిలో ఉండడంతో నిరుపయోగంగా మారిన నాసిరకం నోట్లను కూడా మార్చుకోవచ్చు.

మీరు ఇలా నోట్స్ మార్చుకోవచ్చు
మీ వద్ద చాలా కాలిపోయిన నోట్లు, నోట్లు ఒకదానితో ఒకటి ఇరుక్కుపోయి ఉంటే, వాటిని RBI కార్యాలయం నుండి కూడా మార్చుకోవచ్చు. ఒక వేళ బ్యాంకు వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తే.. మీరు వాటిని RBI ఇష్యూ కార్యాలయానికి తీసుకెళ్లాలి. మీ నోట్‌కు జరిగిన నష్టం నిజమైనదేనని .. ఉద్దేశపూర్వకంగా దెబ్బతినలేదని సంస్థకు విషయాలను ఖచ్చితంగా తెలియజేసేందుకు ఆధారాలుండాలి.