NTV Telugu Site icon

Mantralayam Temple: రోడ్డు ప్రమాదంలో ఆర్గనైజర్‌ మృతి.. దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయిన 500 మంది భక్తులు!

Mantralayam Temple

Mantralayam Temple

Padayatra Organiser dies Near Mantralayam Temple: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రాఘవేంద్రస్వామి దర్శనానికి కర్ణాటక నుంచి పాదయాత్రగా వచ్చిన 500 మంది భక్తులకు ఆర్గనైజర్‌గా వ్యవహరించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆర్గనైజర్‌ మృతి చెందడంతో అతడితో వచ్చిన 500 మంది భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…

కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగుప్ప మండలం కరూర్‌కు చెందిన వీరభద్రా రెడ్డి (40) పాదయాత్ర ఆర్గనైజర్‌. స్వగ్రామం కరూర్‌ నుంచి దాదాపుగా 500 మంది భక్తులను తీసుకుని.. మంత్రాలయానికి అతడు పాదయాత్రగా వస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శివారుకు అందరూ చేరుకున్నారు. మరో అర గంటలో రాఘవేంద్ర స్వామిని దర్శనం ఉందనగా విషాదం నెలకొంది. మంత్రాలయం శివారు తుంగభద్ర రైల్వే స్టేషన్‌ నుంచి పట్టణంలోకి వస్తున్న ఓ ఆటో.. వీరభద్రా రెడ్డిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్గనైజర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read: Pakistan Semi Finals Chances: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. ఓ అద్భుతమే జరగాలి!ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే?

20 సంవత్సరాలుగా వీరభద్రా రెడ్డి సోదరుడు ప్రకాశ్‌ రెడ్డి ఈ పాదయాత్రను నిర్వహించారు. ప్రకాశ్‌ రెడ్డి మరణం అనంతరం గత 8 ఏళ్లుగా వీరభద్రా రెడ్డి పాదయాత్ర బాధ్యతను తీసుకున్నారు. బుధవారం ఊహించని ప్రమాదంలో అతడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. వీరభద్రా రెడ్డి మృతితో పాదయాత్ర భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే స్వగ్రామానికి వెళ్లిపోయారు. వీరభద్రా రెడ్డికి భార్య జయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

 

Show comments