NTV Telugu Site icon

Mobile tower: యూపీలో మొబైల్ టవర్ నే ఎత్తుకెళ్లారు..

Tower

Tower

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన దొంగతనం జరిగింది. కాశాంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో 10 టన్నుల బరువున్న 50 మీటర్ల (సుమారు 164 అడుగులు) సెల్ ఫోన్ టవర్ ను దుండగులు దొంగలించారు. అయితే, మార్చి 31వ తేదీ నుంచి టవర్ కనిపించడం లేదని టెక్నీషియన్ రాజేష్ కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో టవర్ తో పాటు రూ. 8.5 లక్షల విలువైన షెల్టర్, ఇతర పరికరాలు మాయమైనట్లు ఎఫ్ఐఆర్ లో వెల్లడించాడు. టవర్ దొంగలించడమేంటనే వార్త నెట్టింట ఈ వార్త వైరల్ అవుతుంది. టెక్నీషియన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 379 (దొంగతనం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Read Also: TS Election Holiday: వారందరి ఈరోజు సెలవు.. ఉత్తర్వులు జారీ ఎన్నికల అధికారి

2023 జనవరిలో ఉజ్జయిని గ్రామంలో ఉబిద్ ఉల్లా అనే వ్యక్తి పొలంలో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేశారు. మార్చి 31న పొలానికి వెళ్లి పరిశీలించగా టవర్ జాడ కనిపించకుండా పోయిందని టెక్నీషియన్ రాజేష్ కుమార్ యాదవ్ తెలిపారు. అయితే, ఇలాంటి భారీ నిర్మాణాలు కనుమరుగవడం ఇదే తొలిసారి కాదు.. ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో బీహార్‌లోని 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను దొంగలు అపహరించారు. వంతెనలోని లోహాన్ని స్క్రాప్‌గా విక్రయించేందుకు దొంగిలించినట్లు తెలుస్తుంది..సేమ్ అలాగే, యూపీలోని టవర్‌ విషయంలోనూ అదే జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.