Site icon NTV Telugu

Maharashtra: ఘోరం.. పిల్లిని రక్షించబోయి బావిలో పడి ఐదుగురి మృతి

Died

Died

మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పాడుబడిన బావిలో పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు క్షేమంగా బయటపడ్డాడు. ఈ దారుణం అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో అర్థరాత్రి చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో, కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. ఆ బావిని బయోగ్యాస్ కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ కారణంతోనే ఐదుగురు మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: JC Prabhakar Reddy: వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయవద్దు.. మేం అండగా ఉంటాం..

పాడుబడిన బావిలో ఓ పిల్లిలో పడిపోయింది. దీంతో దాన్ని రక్షించేందుకు ఒకరు బావిలోకి దిగారు. అనంతరం ఒక్కొక్కరిగా ఇలా ఐదుగురు బావిలోకి దిగారు. తిరిగి ఒక్కరు కూడా పైకి రాలేదు. దీంతో ఐదుగురు ప్రాణాలు బావిలోనే పోయాయి. తాడు సాయంతో కిందకి దిగిన వ్యక్తి మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ఒకేసారి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్‌ చీఫ్‌కు తప్పిన ముప్పు.. తృటిలో బయటపడ్డ నానా పటోలే

పిల్లిని రక్షించే ప్రయత్నంలో బావిలో పడి ఐదుగురు చనిపోయారని అహ్మద్‌నగర్‌లోని నెవాసా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు. ఈ బావి బయోగ్యాస్ కోసం జంతువుల వ్యర్థాలతో నిల్వ చేయబడి ఉందని వెల్లడించారు. ఒకరినొకరు రక్షించడానికి ఆరుగురు వ్యక్తులు దిగారని.. ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు విడువగా.. తాడు సాయంతో కిందకి దిగిన వ్యక్తి మాత్రం క్షేమంగా బయటపడ్డాడని పోలీస్ అధికారి పేర్కొన్నారు. రెస్క్యూ టీమ్ విజయ్‌ మాణిక్‌ కాలే (35)ను క్షేమంగా రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో నివసించడానికి అత్యంత చౌకైన టాప్-10 దేశాలు ఇవే!

 

Exit mobile version