Site icon NTV Telugu

Explosion: కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం

Explosion

Explosion

Explosion At Chemical Plant In China: తూర్పు చైనాలోని కెమికల్ ప్లాంట్‌లో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తప్పిపోయారని, మరొకరు గాయపడ్డారని స్థానిక ప్రభుత్వం సోమవారం తెలిపింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని లియాచెంగ్ నగరంలోని లక్సీ కెమికల్‌లోని హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి ప్రాంతంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించిందని లియాచెంగ్ హైటెక్ జోన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మంటలను ఆర్పివేశామని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని కమిటీ తెలిపింది.

Read Also: Afzal Ansari: నాలుగేళ్ల జైలు శిక్షతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన మరో ఎంపీ

ప్రమాదం జరిగిన ప్రాంతం ఇండస్ట్రియల్ పార్క్ కాగా.. పలు కంపెనీలు ఉన్నాయి. వేల సంఖ్యలో కార్మికులు పని చేస్తుంటారు. అలాంటి ప్రాంతంలో భారీ పేలుడు కలకలం రేపింది. కార్మికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేలుడికి కారణాలు తెలియాల్సి ఉంది. 2018 నవంబర్ లో ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగింది. కెమికల్స్ లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు పేలిపోయింది. అప్పటి ఘటనలో 23మంది చనిపోయారు.

Exit mobile version