NTV Telugu Site icon

Bihar Spurious Liquor : కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి.. 12 మంది పరిస్థితి విషమం

Spurious Liquor

Spurious Liquor

Bihar Spurious Liquor: బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరోమారు కలకలం చేరింది. మద్యపాన నిషేదంఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కల్తీ మద్యం సేవించి 75 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే రాష్ట్రంలోని మోతీహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మోతీహరి జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఈ మరణాలు సంభవించాయి. మరో 12 మంది కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేయడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

Read Also: Atrocious Incident: తమిళనాడులో దారుణం.. పరువు హత్యకు కొడుకు, అత్త బలి

కల్తీ మద్యం సేవించినందు వల్లనే వీరంతా చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటి వరకు ఈ మరణాలు కల్తీ మద్యం సేవించడం వల్లనే సంభవించాయన్న విషయాన్ని ధృవీకరించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఈ మరణాలకు కారణం ఏవిషయం అనేది చెబుతామని అధికారులు పేర్కొంటున్నారు.

Show comments