బీహార్ లోని ముజఫర్‌పూర్ లో యూట్యూబ్ ని చూసి బాంబు తయారు చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ఘటన బీహార్ లోని ముజఫర్‌పూర్ లో జరిగింది. ముజఫర్‌పూర్ లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలు యూట్యూబ్ లో చూసి అగ్గిపుల్లల్లోని గన్ పౌడర్ తీసి టార్చెస్ లో నింపి బాంబులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్గిపుల్లలో మసాలా వేసి, బ్యాటరీని అమర్చి, టార్చ్ ఆన్ చేయగానే టార్చ్‌లో భారీ పేలుడు వచ్చింది. ఈ పేలుడులో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.., మరో నలుగురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి.
Waqf Bill: ‘‘రాజ్యాంగంపై దాడి’’.. వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళన..
అందిన సమాచారం ప్రకారం., ఈ సంఘటనలో పాల్గొన్న పిల్లలందరూ ఒకే గ్రామానికి చెందిన వారని, వారిలో ముగ్గురు పిల్లలు ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. గాయపడిన చిన్నారి తండ్రి రఘవీర్ యాదవ్ మాట్లాడుతూ.. తన కొడుకు కాలిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. అయితే., గ్రామానికి చేరుకుని చూడగా బాంబు పేలుడులో చిన్నారి కాలిపోయి గాయపడినట్లు గుర్తించారు. ఇప్పుడు ఎవరు కుట్ర చేసి నా బిడ్డను కాల్చారు, లేదా బాంబు పేల్చారో నాకు తెలియదు అంటూ తెలిపాడు.
Paris Olympics 2024: చివరి పోరులో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధిస్తుందా..?
చిన్నారులు యూట్యూబ్ లో వీడియోలు చూసి బాంబులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముజఫర్‌పూర్ ఎస్‌ఎస్పీ రాకేష్ కుమార్ తెలిపారు. పిల్లలు ఆడుకుంటూ ఇలా చేస్తున్నారని, వారి చర్య ఎంత తీవ్రంగా ఉందో వారికి తెలియదని చెప్పాడు. గాయపడిన చిన్నారులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారందరు గైఘాట్ పీఎస్సీలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. పిల్లల ఆన్ లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.