Site icon NTV Telugu

IB Recruitment 2025: మళ్లీ రాని ఛాన్స్.. 10th అర్హతతో.. ఇంటలిజెన్స్ బ్యూరోలో 4,987 జాబ్స్..

Jobs

Jobs

మీరు టెన్త్ క్లాస్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇంటలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4987 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 37 అనుబంధ ఇంటలిజెన్స్ బ్యూరో(SIB)ల్లో నియామకాలు చేపడతారు. సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10వ తరగతి, ఇతర తత్సమాన అర్హతలను పూర్తి చేసి ఉండాలి.

Also Read:Srushti IVF Center : తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ప్రకంపనలు.. వెలుగులోకి సంచలన విషయాలు

అభ్యర్థుల కనీస వయస్సు 17 ఆగస్టు 2025 నాటికి 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఇవ్వబడుతుంది. అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. టైర్-1, టైర్-2 టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది.

Also Read:Peddi : రామ్ చరణ్ ’పెద్ది’ షూటింగ్ కి బ్రేక్..?

యూఆర్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ పురుషులు రూ.650, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మాజీ సైనికులకు రూ.550 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజు జూలై 26, 2025 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 17, 2025 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version