BSNL Launched Rs 498 Rechage Plan with 6 Months Validity: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడూ సరికొత్త ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. ప్రస్తుతం భారత టెలికాం రంగంను ఏలుతున్న జియో, ఎయిర్‌టెల్‌లకు దీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 498తో 6 నెలల వ్యాలిడిటీని అందిస్తోంది. సుదీర్ఘ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఆప్షన్ అని చెప్పోచ్చు.
తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 498 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 498తో రీఛార్జ్ చేసుకుంటే మీకు 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దాంతో మీకు తరచుగా రీఛార్జ్ చేసే సమస్య ఉండదు. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్లాన్‌లో కంపెనీ రూ. 100 టాక్ టైమ్ ఉచితంగా అందిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు కాల్ చేస్తే.. నిమిషానికి 10 పైసల చొప్పున చార్జ్ అవుతుంది. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 30 పైసలు చెల్లించాలి.
Also Read: World Cup 2023: ప్రపంచకప్ 2023కి భారత్ జట్టు ఇదే.. రాహుల్, అయ్యర్ ఎంట్రీ! మరో అనూహ్య ఎంపిక
బీఎస్‌ఎన్‌ఎల్ అందించే రూ. 100 ఉచిత టాక్ టైమ్ తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ప్లాన్‌లో ఉచిత డేటా, ఉచిత కాలింగ్ సౌకర్యం పొందలేరు. ఎక్కువ డేటా, కాలింగ్ అవసరం లేకపోతే.. మీరు ఈ ప్లాన్‌ని యాక్టివేట్ చేయవచ్చు. రెండు సిమ్ కార్డులు ఉన్న వారికి బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 498 రీఛార్జ్ ఉపయోగకరంగా ఉంటుంది. రెండో సిమ్‌కు ఈ ప్లాన్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. 180 రోజుల వ్యాలిడిటీ కోసం బీఎస్‌ఎన్‌ఎల్ కంటే ఇతర టెలికాం సంస్థల రీఛార్జ్ ఎక్కువగానే ఉన్నాయి.