Site icon NTV Telugu

TS VOTER: తెలంగాణలో పదిలక్షల డూప్లికేట్ ఓట్లు

Aadhaar

Aadhaar

TS VOTER: ఎన్నికల కమిషన్ కొన్ని నెలల క్రితం ప్రతీ ఓటరు తమ ఓటరు కార్డును ఆధార్ తో అనుసంధానం చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చాల మంది ఓటర్లు తమ ఓటు కార్డును ఆధార్ తో లింక్ చేసుకున్నారు. ఆధార్ తో ఓటరు గుర్తింపు కార్డుల అనుసంధానం వల్ల బోగస్ ఓట్లను ఏరివేయవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని 47శాతం మంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటరు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.95కోట్లు. దానిలో ఇప్పటికే 1.4కోట్ల మంది తమ ఓటు కార్డును ఆధార్ తో అనుసంధానించారు. ఆధార్‌తో ఓటు కార్డును లింక్ చేసుకోవడం కోసం వెబ్‌సైట్లో దరఖాస్తులు ఉన్నాయి లేదంటే గరుడా యాప్ సాయంతో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల అభ్యర్థనలను స్వీకరించొచ్చు అని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల సంఘానికి చెందిన ఈఆర్వో నెట్ వెబ్‌పైట్‌లో ప్రతి మూడు నెలలకోసారి ఓటరు జాబితాలను సవరిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించామన్నారు. ఓటర్ల సమ్మతితో డుప్లికేట్ ఓట్లను తొలగించామన్నారు. ఇప్పటి వరకూ పది లక్షల ఓటర్లను తొలగించామని.. ఇందులో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయన్నారు.

Read Also: Solar Energy Cloth : స్మార్ట్ ఫోన్లకు షర్ట్ తోనే చార్జింగ్ పెట్టేయొచ్చు.. అద్భుత ఆవిష్కరణ

టెక్నాలజీపై అవగాహన లేని గ్రామీణ ప్రాంతాల వారి కోసం డోర్ టు డోర్ సర్వే నిర్వహించారు అధికారులు. వారి చేత ఆధార్ తో ఓటు కార్డు లింక్ చేపట్టే ప్రక్రియను చేపట్టినట్లు ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణాల్లోనే డూప్లికేట్ ఓట్ల సమస్య ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఎక్కువగా ప్రజలు అద్దె ఇండ్లలో నివాసముండే వారే కారణమన్నారు. తరచుగా ఇళ్లు మారడం.. మారినప్పుడల్లా కొత్త అడ్రస్ తో పాత కార్డును తొలగించుకోకుండా.. కొత్త దానికి అప్లై చేయడంతోనే డూప్లికేట్ కార్డుల సమస్య తీవ్రంగా ఉందన్నారు.

Exit mobile version