NTV Telugu Site icon

Financial Fraud : షాకింగ్.. మూడేళ్లలో 47శాతం మంది యూపీఐ, క్రెడిట్ కార్డ్ మోసాలకు గురయ్యారు

New Project (80)

New Project (80)

Financial Fraud : గత మూడేళ్లలో 47 శాతం మంది భారతీయులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక మోసాలను ఎదుర్కొన్నారు. వీటిలో యూపీఐ, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఆర్థిక మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని శుక్రవారం విడుదల చేసిన సర్వే నివేదిక పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారులు/వెబ్‌సైట్‌ల ద్వారా సగానికి పైగా తమ క్రెడిట్ కార్డ్‌లపై అనధికారిక ఛార్జీలను ఎదుర్కొన్నారని సర్వే ఏజెన్సీ లోకల్ సర్కిల్స్ 302 జిల్లాల్లోని 23,000 మంది వ్యక్తులపై నిర్వహించిన సర్వేలో తెలిపింది.

Read Also:Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్ ‘ మూవీ స్పెషల్ అప్డేట్ వైరల్..

క్రెడిట్ కార్డు మోసం గురించి చెప్పిన 43శాతం మంది
మోసాలను నిరోధించడానికి భద్రతా చర్యలను పెంచడం, వినియోగదారులకు అవగాహన కల్పించడంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలను నివేదిక హైలెట్ చేసింది. ఈ మేరకు ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వేలో 43 శాతం మంది క్రెడిట్ కార్డ్‌లపై మోసపూరిత లావాదేవీలను నివేదించారు. 36 శాతం మంది తమకు మోసపూరిత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. క్రెడిట్ కార్డ్ మోసానికి సంబంధించి, 53 శాతం మంది ప్రజలు దేశీయ వ్యాపారులు, వెబ్‌సైట్‌లు చేసిన అనధికార ఛార్జీల గురించి వెల్లడించారు.

Read Also:Leopard: తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్..

166శాతం పెరిగిన మోసాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మోసం కేసులు 166 శాతం పెరిగి 36,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వాటి విలువ దాదాపు సగం (రూ. 13,930 కోట్లు). గత మూడేళ్లలో సేకరించిన డేటాను పరిశీలిస్తే.. మోసపోయిన 10 మంది భారతీయుల్లో ఆరుగురు ఆర్థిక మోసాలను గురించి నియంత్రణాధికారులకు నివేదించడం లేదని అంచనా వేస్తున్నట్లు లోకల్ సర్కిల్స్ తెలిపింది.