NTV Telugu Site icon

China : చైనాలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 47 మంది మృతి

New Project 2024 06 22t065531.393

New Project 2024 06 22t065531.393

China : చైనాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 47 మంది మరణించారు. మెయిజౌ నగరంలో మరో 38 మంది మరణించినట్లు ధృవీకరించినట్లు చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం మధ్యాహ్నం తెలిపింది. ఇదే నగరంలో ఇంతకు ముందు మరో తొమ్మిది మంది మరణించారని పేర్కొంది. ఏప్రిల్‌లోనే చైనాలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వరదల హెచ్చరిక జారీ చేసింది. ఈ సమయంలో కూడా చైనాలోని పలు ప్రావిన్సులు వరదల్లో మునిగిపోయాయి. ఈ వరద లక్షల ఇళ్లను ముంచేసింది.

Read Also:Jagga Reddy : రెచ్చగొట్టడం కాదు.. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టండి

దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ కుండపోత వర్షాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. దక్షిణ చైనాలోని పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు పంటలు కూడా ధ్వంసమయ్యాయి. రెస్క్యూ టీమ్‌లు గల్లంతైన వారి కోసం గాలింపు చర్చల్లో నిమగ్నమై ఉన్నాయి. ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందిస్తున్నాయి.

Read Also:Srikakulam Sherlock Holmes : హరీష్ శంకర్ చేతుల మీదుగా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్ సాంగ్ లాంచ్..

కొండచరియలు విరిగిపడటం, వరదలు, ఇతర విపత్తుల నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కోవటానికి గ్వాంగ్‌డాంగ్‌లో గురువారం ముందుగా అత్యవసర ప్రతిస్పందన స్థాయిని పెంచారు. తద్వారా ఆ సహాయం ప్రజలకు త్వరగా చేరుతుంది. అనేక ఇతర ప్రావిన్సులలో లెవెల్-IV అత్యవసర ప్రతిస్పందన ఇప్పటికే సక్రియం చేయబడింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి చైనాలో వరదల సీజన్ ముందుగానే ప్రారంభమైందని సమాచారం.